ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే హిట్‌మ్యాన్ రోహిత శర్మ లాంగ్ ఫార్మాట్ నుంచి వైదొలగగా.. ఇప్పుడు అదే బాటలో కోహ్లి కూడా నడిచారు. 14 ఏళ్లుగా టెస్టుల్లో ఇండియా తరఫున ఆడుతూ వచ్చిన కోహ్లి.. తాజాగా తన రిటైర్మెంట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ ప్రకటన సగటు క్రికెట్ అభిమానిని సైతం షాక్ అయ్యేలా చేసింది.
ఇప్పటికే టీ20ల నుంచి తప్పుకున్న కింగ్.. లాంగ్ ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలకడంతో అభిమానులు జీర్ణయించుకోలేకపోతున్నారు. మంచి ఫామ్‌లో ఉండగానే టెస్ట్ క్రికెట్‌కు కోహ్లి గుడ్ బై చెప్పడానికి గల కారణమేంటో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. టీమిండియాలో యువ రక్తాన్ని ఎక్కించాలని యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే భారత టెస్ట్ క్రికెట్ జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలడంతో.. కెప్టెన్సీ పగ్గాలు యువ ఆటగాడు శోభన్ గిల్ కి అప్పగించాలని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అలాగే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వంటి వారు వైస్ కెప్టెన్ రేసులో ఉన్నారు.
అయితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనంతరం టెస్టు జట్టుకు సారథి కావాలని విరాట్ కోహ్లీ భావించాడు. ఇదే ప్రతిపాదన బీసీసీఐ ముందు ఉంచగా.. వారు అందుకు నో చెప్పేశారు. ఈ కారణంగానే సుదీర్ఘ ఫార్మాట్ కు కోహ్లి శాశ్వత వీడ్కోలు పలికాడని అంటున్నారు. కోహ్లి నిర్ణయాన్ని బీసీసీఐ మొదట వ్యతిరేకించింది. ఇంకొన్నాళ్లు టెస్టుల్లో ఆడాలని, కనీసం ఇంగ్లాండ్ సిరీస్ వరకు అయినా కంటిన్యూ అవ్వాలని కోరింది. కానీ, కింగ్ మాత్రం అందుకు అంగీకరించలేదు.
ఇక టెస్ట్ క్రికెట్‌కు కోహ్లి గుడ్ బై చెప్పడంతో.. ఆయనకు ఎంత పెన్షన్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లికి 123 మ్యాచులు ఆడిన అనుభవం ఉంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచులు ఆడిన ఆటగాళ్లకు నెలకు రూ.70 వేల పెన్షన్ ఇస్తారు. కోహ్లికి కూడా అంతే మొత్తం అందుతుంది. అర్హుడే అయినా కోహ్లికి ఈ పెన్షన్ రాదు. ఎంతుకంటే, ఆయన ఇంకా వన్డేల్లో కొనసాగుతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌కూ రిటైర్మెంట్ ప్రకటించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు అతనికి పెన్షన్ దక్కుతుంది. కాగా, టెస్టు క్రికెట్ కు దూరం కావడంతో కోహ్లి ఆదాయం భారీగా తగ్గనుంది. ఇప్పటివరకు ఏ-ప్లస్ గ్రేడ్ కలిగిన విరాట్ కోహ్లి బోర్డు నుంచి సంవత్సరానికి రూ. 7 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఇప్పుడు ఏ ప్లస్ నుంచి ఏ కేటగిరీకి పడిపోతే ఆయనకు రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే అందుతుంది.