ఏపీలో అమరావతి రాజధాని రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న సంగతి తెలిసిందే. తమ భూములను రాజధాని కోసం విరాళమిచ్చి దగాపడ్డ రైతుల ఆత్మఘోషకు, అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రైతులకు ఏపీ, తెలంగాణలతోపాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు మద్దతు తెలుపుతున్నారు. రాజధాని అమరావతి కోసం పచ్చటి పంట పొలాలను త్యజించిన రైతులకు అండగా ఎన్నారైలు, ఎన్నారై సంఘాలు ముందుకు వస్తున్నాయి.
‘జయరాం కోమటి’ పిలుపునకు స్పంధించిన ‘సురేష్ పుట్టగుంట’ అమరావతి రైతులకోసం రూ.20 లక్షలు తన వంతు విరాళం అందించారు. విజయవాడ వాస్తవ్యుడు అయిన సురేష్ చాలా సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి డిట్రాయిట్ లో స్థిరపడ్డారు. ‘తానా’ ట్రస్టీ కూడా అయిన సురేష్,చాలా కాలంగా తెలుగువారికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, తనవంతు సహాయసహకారాలందిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ విరాళాన్ని ప్రకటించారు. తమకు అండగా నిలిచిన ‘సురేష్ పుట్టగుంట’కు అమరావతి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు.