రాహుల్‌గాంధీ నేపాల్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. విజయసాయి రాహుల్‌పై చేసిన ట్విట్‌కి మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.‘‘అవినీతి విజయసాయిరెడ్డి నిజం తెలుసుకోవాలి. మీ సమస్య జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులన్నీ మాకు తెలుసు.
అందుకు మీరు సాహెబ్‌ని సంతోషంగా ఉంచాలి… కానీ నిజం మర్చిపోకండి. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వెళ్లారు. నేపాల్‌కి చెందిన ఖాట్మాండ్ పోస్ట్ పేపర్ క్లిప్‌ను మాణిక్యం ఠాగూర్ విజయసాయిరెడ్డికి టాగ్ చేశారు. వివాహ వేడుకకు హాజరుకావడంలో తప్పేముంది“ అని విజయసాయిరెడ్డిని మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్లో ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ లోని నైట్ క్లబ్ లో ఉన్న వీడియో పైన ముదిరిన రాజకీయ వివాదం అనేక మలుపులు తీసుకుంది. రాహుల్ గాంధీ ఖాట్మండులోని ఒక నైట్ క్లబ్ లో ఉండటం..ఆయన తో పాటుగా నేపాల్ లో చైనా రాయబారి హౌ యాంక్వీ ఉండటం పెద్ద వివాదంగా మారింది. దీనిని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వైరల్ చేశారురు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లకు వెళ్తున్నారంటూ సెటైర్లు వేశారు.
రాహల్ నైట్ క్లబ్ కు వెళ్లటం పైన బీజేపీ నేతల విమర్శలకు కాంగ్రెస్ సమాధానం ఇచ్చింది. నేపాల్ లో వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ వెళ్లారని..అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. అసలు..ఆ వీడియోలో ఏం తప్పు ఉందని నిలదీస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి బీజేపీ నేతల వాయిస్ అందుకున్నారు. నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ పక్కన ఉంది ఎవరో తెలుసా అంటూ ట్వీట్ చేశారు. నేపాల్ లో చైనా దౌత్యవేత్తగా పని చేస్తున్న హౌ యాంక్వీ అని చెబుతూ.. గతంలో ఆమె చేసిన హానీ ట్రాప్ గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ యూరప్ పర్యటన పైన కాంగ్రెస్ అవసరం లేని విమర్శలు చేసిందని చెబుతూ..ఇప్పుడు కాంగ్రెస్ నేత వివాదంలో చిక్కుకున్నారంటూ ట్వీట్ చేశారు. దీని పైన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ఈ వివాదం ప్రారంభమైన వెంటనే ఆయన తొలుత కేంద్ర మాజీ మంత్రి..బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఫొటో ఒకటి ట్వీట్ చేస్తూ….ఎవరో తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇక, విజయ సాయిరెడ్డి ట్వీట్ కు ఆయన సమాధానం ఇచ్చారు.
వాస్తవం ఏంటో చూడాలని సూచిస్తూనే… అవినీతి సాయిరెడ్డి ఇబ్బంది ఏంటో తనకు తెలుసని…జగన్ రెడ్డి పైన కేసుల కారణంగానే సాహిబ్ (ప్రధాని) ని సంతోష పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ..నేపాల్ రాయబారి కుమార్తె వివాహానికి హాజరయ్యారని..ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. సాయిరెడ్డి ట్వీట్ పైన పలువురు అనుకూలంగా…ప్రతికూలంగా తమ స్పందనలు తెలియచేస్తున్నారు.