బాలీవుడ్ ఫిలిం సెలబ్రెటీలు కోస్టార్లతో డేటింగ్ చేయడం చాలా మామూలు విషయం. దాని గురించి ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు కూడా. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా దాని గురించి ఓపెన్ అవ్వరు. ఐతే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మాత్రం ఇలాంటి విషయాలను దాచుకోడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతను తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
విజయ్ లేటెస్ట్గా ‘హీరియే’ ఫేమ్ జస్లీన్ రాయల్‌తో కలిసి ఒక ప్రైవేట్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో.. విజయ్, జస్లీన్లకు ఒక క్రేజీ ప్రశ్న ఎదురైంది. ఎప్పుడైనా కోస్టార్‌తో డేటింగ్ చేశారా అని అడిగితేే.. జస్లీనో ‘నో’ అనేసింది. కానీ విజయ్ మాత్రం ‘‘నేను చేశా’’ అన్నాడు. మరి వివరాలు చెప్పండి అని అడిగితే మాత్రం కుదరదు అన్నాడు.
విజయ్ చెప్పకపోయినా.. అతను డేటింగ్ చేసింది రష్మిక మందన్నాతోనే అని నెటిజన్ల అభిప్రాయం. చాలా ఏళ్ల నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు జనం భావిస్తున్నారు. ‘గీత గోవిందం’ చిత్రంతో తొలిసారి జత కట్టిన ఈ జోడీ.. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లోనూ కలిసి నటించింది. ఆ రెండు చిత్రాల్లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ, బయట సాన్నిహిత్యం చూసి లవ్‌లో ఉన్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. ఇద్దరూ కలిసి ఫారిన్ టూర్లకు వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఒకే చోట నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఫొటోలు పెట్టి నెటిజన్లను పలు సందర్భాల్లో టీజ్ చేసింది ఈ జంట. ఇప్పటికీ విజయ్, రష్మిక రిలేషన్షిప్లోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు. విజయ్ ఇంటర్వ్యూలో చెప్పింది రష్మిక గురించే అని నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం విజయ్.. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక చేతిలో ‘పుష్ప-2’తో పాటు మరి కొన్ని సినిమాలున్నాయి.