కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. తనను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేస్తున్న కామెంట్లకు రఘురామ దీటుగా కౌంటర్లివ్వడంతో వారిద్దరి మధ్య ట్వీట్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. ఈ క్రమంలోనే తాజాగా సాయిచెడ్డి చేసిన ట్వీట్ కు ఆర్ఆర్ఆర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
”జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా… నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదా?. గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా’’ అని సాయిరెడ్డి చేసిన ట్వీట్ కు ఆర్ఆర్ఆర్ దీటుగా జవాబిచ్చారు. తన జీవితం ఏ1, ఏ2లకు భారంగా ఉందనే వివేకానందరెడ్డిలాగా కడతేర్చాలనుకుంటున్నారంటూ ఆర్ఆర్ఆర్ అన్నారు.
అంతేకాదు, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని.. రొచ్చులో తొక్కేరోజు దగ్గర పడింది.. ఏ2..అంటూ రఘురామ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు, పీఆర్సీ జీవోలను రద్దు చెయ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలను రఘురామ ఖండించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులను కించపరిచేలా అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలున్నాయంటూ మండిపడ్డారు. ఉద్యోగులను జగన్ మోసం చేశారని ఆర్ఆర్ఆర్ దుయ్యబట్టారు.