రాష్ట్రపతి ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ.. అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం తమ పార్టీ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపుతున్నారన్న అంశంపై క్లారిటీ రాని పరిస్థితి. ఓపక్క సెంటిమెంట్.. మరోపక్క వెంకయ్యకు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఆయన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతుంటే.. మరోవైపు అలాంటిదేమీ లేదు.. ఆయనకు హ్యాండ్ ఇవ్వాలన్న యోచనలో మోడీషాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం అనూహ్య పరిణామాలుచోటు చేసుకున్నాయి. ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్య నాయుడ్ని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించటానికి వీలుగా ఆయనతో చర్చించేందుకే వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి నివాసానికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మరో కీలక కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు వెంకయ్యతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశానికి కాస్త ముందుగా ఆయన ఈ తెల్లవారుజామున (మంగళవారం) 5.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం బేగంపేట నుంచి ఢిల్లీకి చేరుకున్న వెంకయ్య నివాసానికి బీజేపీ ముఖ్యనేతలు వెళ్లటం.. ఆయనతో సుదీర్ఘంగా చర్చించటం చూస్తే. రాష్ట్రపతి అభ్యర్థికా ఎంపిక చేసే విషయంలో బీజేపీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది.
ఈ మీటింగ్ లోనే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరును ప్రకటిస్తారని కొందరు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా దీనిపై కన్ఫ్యూజన్ కు తెర పడే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. తెలుగోడు దేశానికి రాష్ట్రానికే కాదు .. తెలుగు ప్రజలందరికి సరికొత్త స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.