ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, మెగా అభిమానుల మధ్య కొద్ది రోజలుగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గరికపాటిని ఏమీ అనవద్దంటూ మెగా బ్రదర్ నాగబాబు చెప్పినప్పటికీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో గరికపాటిని ట్రోల్ చేయడం ఆపడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే గరికపాటి పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిని అవమానించిన గరికపాటిని క్షమించే ప్రసక్తే లేదని, తమ దృష్టిలో చిరంజీవిని అవమానించినవారు గడ్డిపరకతో సమానం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గరికపాటిని ఏమీ అనకుండా వదిలేయడం మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల సంస్కారం అని వర్మ చెప్పారు. అయితే, ఆ గడ్డిని మంటల్లో మండించకపోతే గడ్డి నమ్మే అమ్మవారు కూడా తమను క్షమించదంటూ వర్మ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.
“హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో…హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి.. సర్ నాగబాబు గారు.. ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ఎందుకు ఇచ్చారు సర్ సర్ సర్ చిరంజీవి?? ” అంటూ వర్మ చేసిన ట్వీట్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.