అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 41 ఇస్లామిక్ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. అంతేకాదు, తాజాగా అమెరికాకు గిట్టని దేశాలపై కూడా ట్రాంప్ ఉక్కు పాదం మోపుతున్నారు. 4 దేశాలకు చెందిన దాదాపు ఐదున్నర లక్షల మంది వీసాలను రద్దు చేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఓ వైపు యూనివర్సిటీలపై ఆంక్షల కొరడా ఝళిపిస్తున్న ట్రంప్ దెబ్బకు విద్యార్థులు వణికిపోతున్నారు.ఇక, అక్రమ వలసదారులను టార్గెట్ చేసి వారి వారి దేశాలకు డిపోర్ట్ చేస్తున్న ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. 4 దేశాలకు చెందిన తాత్కాలిక వలసదారులను ఇంటికి పంపించేందుకు ట్రంప్ రంగం సిద్ధం చేశారు. లాటిన్ అమెరికాలోని 4 దేశాలకు చెందిన ఐదున్నర లక్షల మందిని వారి వారి స్వదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. క్యూబా, హైతీ, నికరాగువా, వెనెజువెలా దేశాల వలసదారుల తాత్కాలిక రక్షణను రద్దు చేస్తున్నామని హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. వారికి చట్టపరమైన నివాస హోదా రద్దు చేసింది.