జగన్ ప్రమాదంలో పడిన ప్రతిసారీ ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి జనాలకు హిప్నటైజ్ చేసి వెళ్తుంటాడు. మరి జగన్ అంటే అంత ఎందుకు ప్రేమో ఆయనే చెప్పాలి. వైఎస్ కొడుకు కాబట్టి అభిమానం అని బహిరంగంగా ఆయనే చెప్పుకున్నాక… జగన్ కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడే మాటలు అన్నీ నిజమని ఎవరు నమ్ముతారు?
కానీ యథాలాపంగా ఎంత జాగ్రత్తగా మాట్లాడినా కొన్ని మనసులో మాటలు బయటకు వస్తుంటాయి. అలాంటి ఒక మాటను ఉండవల్లి ఆత్రుతలో బయటపెట్టేశాడు.
జగన్ అంటే రఘురామరాజుకు చాలా ప్రేమ అని, అలాంటి రఘురామరాజును తన అహంకారంతో జగన్ రెచ్చగొట్టడం వల్లే పరిస్థితి ఇంత దాకా వచ్చిందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో ఇంత దాకా అంటే… బెయిలు రద్దయ్యే పిటిషను వేసి దానిని రఘురామరాజు ఫాలోఅప్ చేసే వరకు జగన్ తెచ్చుకున్నాడన్నది ఉండవల్లి అంతరార్థం.
పురాణ కథలతో కలిపి జగన్ అహంకారాన్ని ఉండవల్లి ఎలా వివరించాడో ఈ వీడియోలో చూడొచ్చు.