ఏపీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్టీఆర్ కుటుంబంపై గురించి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు చిన్న పుకారు మాటలు కూడా తాను వినలేదన్నారు.
ఎన్టీఆర్ కుటుంబంలో తనకు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితో మంచి పరిచయం ఉందని… ఆవిడ డౌన్ టు ఎర్త్ చాలా బాగా మాట్లాడతారని ఉండపల్లి ప్రశంసించారు.
ఇక దివంగత నందమూరి హరికృష్ణతో కూడా తనకు మంచి పరిచయం ఉందని గుర్తు చేసుకున్నారు. అవసరం లేకుండా కూడా హరికృష్ణ తనతో పరిచయం పెంచుకొని ఎంతో గౌరవం మాట్లాడేవారని చెప్పారు. హరికృష్ణ పైకి చూడటానికి మాత్రమే గాంభీర్యంగా కనిపించినా… చాలా మంచి మనిషి అని ఉండవల్లి చెప్పారు.
ఎన్టీఆర్ కుటుంబం గురించి ఎప్పుడూ… ఎవ్వరూ చెడుగా మాట్లాడుకోలేదని.. అయినా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. దాని గురించే బాబు పదే పదే ఎందుకు తలచుకుని బాధపడుతున్నారో ? తనకు అర్థం కావడం లేదని ఉండవల్లి అన్నారు.
భువనేశ్వరి అంశంపై కన్నీళ్లు కార్చాల్సిన అవసరం బాబుకు ఎందుకు వచ్చిందో ? తనకు తెలియదని అన్నారు. అసలు వాస్తవంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆ పుకార్లు గురించి చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.
ఏ సందర్భం లేకుండా ఎవరు అయినా మాట్లాడుతున్నారు అంటే అది వారి మానసిక సమస్యలకు సంబంధించిన కారణం అయ్యి ఉండవచ్చని ఉండవల్లి అన్నారు. ఉన్నతమైన సభలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తే.. అందరూ వారికి తిరిగి అదే గౌరవం ఇస్తారని చెప్పారు.
ఏదేమైనా ఉండవల్లి అసెంబ్లీలో జరిగిన ఈ రగడలో వైసీపీని పాయింట్ అవుట్ చేసి విమర్శించారు. ఇటీవల ఉండవల్లి జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైఎస్సార్‌కు ఎంతో సన్నిహితుడిగా ఉన్న ఉండవల్లి ఈ తరహా కామెంట్లు చేస్తుండడం వైసీపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమవుతోంది.