తెలుగు వారికి కొత్త సంవత్సరం వచ్చేసింది. అంటే రాశి ఫలాలు గుర్తుకొస్తాయి. ఉగాదితో మొదలయ్యే కొత్త సంవత్సరంలో భాగంగా తాజాగా శోభకృత్ నామసంవత్సరం ఈ రోజు నుంచి మొదలైంది. కొత్త ఏడాది ఎలా ఉండనుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఉగాది పర్వదినం వేళ.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందన్న పంచాంగ శ్రవణం తెలిసిందే. మరి.. ఈ కొత్త ఏడాదిలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందన్న విషయంలోకి వెళితే..
మేషం
అదాయం 5 – వ్యయం 5
రాజపూజ్యం 3 – అవమానం 1
– ఆదాయం వ్యయం సమానంగా ఉండటం వల్ల ఆర్థిక అంశాలు ఎలా ఉంటాయన్నది ఇట్టే అర్థమవుతుంది. ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. మంచి పనులకు డబ్బుల్ని వెచ్చిస్తారు. పెట్టుబడులు లాభాల్ని ఇస్తాయి. వ్యాపార.. ఉద్యోగ.. వ్రత్తుల్లో విశేష పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ఏకదశంలో శని విశేషమైన శుభాన్ని ఇస్తున్నాడు.
– విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న స్థాయికి చేరుకుంటారు. వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. మొహమాటం కారణంగా రుణసమస్యలు రాకుండా చూసుకోవాలి.
– విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబ సభ్యులు సహకారం ఉంటుంది. భూములు.. ఇళ్లు కొనుగోలు చేసే వీలుంది. అక్టోబరు.. నవంబరులో ఇబ్బందులు తలెత్తే వీలుంది. రోజు గరు శ్లోకం చదువుకోవటం ఉత్తమం.
వృషభం
అదాయం 14 – వ్యయం 11
రాజపూజ్యం 6 – అవమానం 1
– ఆదాయం 14.. వ్యయం 11 అన్నంతనే ఈ ఏడాది ఆదాయం ఎంతలా ఉంటుంది? ఖర్చు మరెంతలా ఉంటుందన్న విషయంపై స్పష్టత వచ్చేసినట్లే. విశేషమైన ఆదాయంతో పాటు పెట్టుబడి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ ఏడాది మీకు లక్ ఎక్కువ. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు.
– విద్యార్థులకు.. ఉద్యోగులకు.. వ్యాపారులకు బ్రహ్మండంగా ఉంటుంది. విదేశాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఇల్లు.. భూములు.. వాహనాల్ని కొనే యోగం ఉంది. విఘ్నాలు తొలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
– ఏప్రిల్ లో ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోవాలి. శని దశమంలో ఉన్నకారణంగా ఉద్యోగపరమైన ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. శ్రమ కలిగినా నవంబరు నుంచి శుభయోగాలు ఉన్నాయి.
మిథునం
అదాయం 2 – వ్యయం 11
రాజపూజ్యం 2 – అవమానం 4
ఆదాయ వ్యయాల లెక్క చూస్తేనే ఈ ఏడాది ఈ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థమవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండటంతో ఒత్తిళ్లు తప్పవు.కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. లక్ యాభై శాతమే ఉంటుంది.
– విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులకు అధికార యోగం ఉంది. వ్యాపారంలో ఎదుగుతారు. ఇల్లు.. భూములు.. వాహన యోగాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఏప్రిల్ 22 వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
– శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ శుభ ఫలితాలు ఉంటాయి. లోతుగా ఆలోచించొద్దు. కేతు సంచారం వల్ల మానసిక సమస్యలు రాకుండా కేతు శ్లోకం చదువుకోవాలి.
కర్కాటకం
అదాయం 11 – వ్యయం 8
రాజపూజ్యం 5 – అవమానం 4
ఆదాయ.. వ్యయాలను చూస్తే ఈఏడాది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లక్ 75 శాతం బాగుంది.అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు రానున్నాయి. వ్యాపారం బాగుంటుంది.
– పెట్టుబడులకు అనువైన కాలం. అష్టమ శని దోషం వల్ల తెలియని అనారోగ్యాలు ఎదురయ్యే వీలుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. రాహువు కారణంగా నవంబరు నుంచి విఘ్నాలు కలిగే అవకాశం ఉంది. కేతువు నవంబరు నుంచి దివ్యమైన శుభ ఫలితాల్ని ఇచ్చే వీలుంది.
సింహం
అదాయం 14 – వ్యయం 2
రాజపూజ్యం 1 – అవమానం 7
ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో తిరుగులేని ఆదాయ యోగం ఉంది. లక్ 50 శాతం ఉన్నప్పటికీ అర్థికంగా మాత్రం మేలు కలుగుతుంది. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగులకు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులుపెరుగుతాయి.
– ఆస్తిని పెంచుతారు. ఇంట్లో శుభకార్యాలు ఉంటాయి. గురువు సంచారం కారణంగా ఏప్రిల్ మూడో వారం వరకు శ్రమ ఉంటుంది. తర్వాత మాత్రం అద్రష్ట యోగం.
– శని సప్తమ రాశిలో ఉన్న కారణంగా భాగస్వామితో గొడవలు ఏర్పడతాయి. సర్దుకుపోవటం ఉత్తమం. వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. కేతు శ్లోకం చదువుకోవటంమంచిది.
కన్య
అదాయం 2 – వ్యయం 11
రాజపూజ్యం 4 – అవమానం 7
ఆదాయ వ్యయాల్ని చూస్తే ఈ ఏడాది ఆర్థికంగా ఏ మాత్రం బాగోలేదన్న విషయం అర్థమవుతుంది. ఈ కారణంగా ఖర్చు మీద జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ లక్ మాత్రం బాగుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండాలి.
– గురు బలం కారణంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనుల్లో మంచి జరుగుతుంది. విద్యార్థులు శుభ ఫలితాలు నమోదు చేసే అవకాశాలుఉన్నాయి. ఉద్యోగంలో మొదటి ఆర్నెల్లు బాగుంటుంది. ఆ తర్వాత మాత్రం మరింత ఏకాగ్రతతతో పని చేయాల్సి ఉంటుంది.
– పనులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వద్దు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గరువు సప్తమంలో ఉన్నంత కాలం శుభయోగాలు ఉంటాయి. శని ఈ ఏడాదంతా షష్ఠ స్థానంలో ఉన్నందు వల్ల అద్రష్టం ఉంటుంది. రాహు శ్లోకం చదువుకోవాలి.
– ఈ ఏడాదిలో నిరాశ.. వైరాగ్యం లాంటి ఇబ్బందికర ఫలితాలు ఉత్సాహాన్నితగ్గించే వీలుంది.
తుల
అదాయం 14 – వ్యయం 11
రాజపూజ్యం 7 – అవమానం 7
ఆదాయ వ్యయాలకు ఇబ్బంది లేదు. ధర్మమార్గంలో నడిస్తే మేలు. స్థిరాస్థుల కొనుగోలుకు ధనాన్ని వెచ్చిస్తారు. లక్ బాగుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగపరంగా శ్రేష్ఠమైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు సొంతం చేసుకుంటారు.
-కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్లో మంచి జరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు ఉంటాయి. ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా శని శ్లోకం చదువుకోవాలి.
– రాహువు అక్టోబరు 31 వరకు సప్తమంలో ఇబ్బందులు కలిగించొచచు. నవంబరు నుంచి శుభయోగం ఉంది. కేతు శ్లోకం చదువుకోవాలి.
వృశ్చికం
అదాయం 5 – వ్యయం 5
రాజపూజ్యం 3 – అవమానం 3
ఆదాయం.. వ్యయం సరిసమానంగా ఉండటంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. బాగా కష్టపడాలి.లక్ బాగుంది. బలంగా కోరుకున్నది సాధిస్తారు. కాలం వీరికి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ వరకు విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగంలో అనుకున్న ఫలితాలు వస్తాయి.
– వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది.ఇంట్లో శాంతికి వీలుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. శని శ్లోకం చదువుకోవటం ఉత్తమం.
ధనస్సు
అదాయం 8 – వ్యయం 11
రాజపూజ్యం 6 – అవమానం 3
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో అప్రమత్తత అవసరం. ప్రతిభను గుర్తించి ఆదరించే వారు పెరుగుతారు. లక్ 75 శాతం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఇప్పుడు వస్తాయి. విద్యార్థులు ఉన్నత స్థాయిలో రాణిస్తారు.
– ఉద్యోగం బ్రహ్మండంగా ఉంటుంది. అధికారయోగం ఉంది. పెద్దలను మెప్పిస్తారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. ధన.. ధాన్యాలకు కొదవ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.
– ఇంట్లో ఉన్న వాతావరణం ప్రశాంతతను కలిగిస్తుంది. బంగారు భవిష్యత్తుకు అవసరమైన పనులు చేపడతారు. కొన్ని ఇబ్బందులుఎదురవుతాయి. కేతువు కారణంగా అద్రష్ట యోగం ఉంది. అక్టోబరు – నవంబరులో శుభ ఫలితాలు ఉంటాయి.
మకరం
అదాయం 11 – వ్యయం 5
రాజపూజ్యం 2 – అవమానం 6
ఆదాయానికి ఢోకా ఉండదు. ఖర్చు విషయంలో పెద్దగా ఇబ్బందుల్లేవు. ధనయోగానికి వీలుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. కాకుంటే వివాదాలకుదూరంగా ఉండటం చాలా అవసరం. లక్ 50 శాతమే. పట్టుదలతో పని చేస్తే గ్రహబలం తోడవుతుంది. మంచి ఫలితాలకు అవకాశం ఉంటుంది.విద్యార్థులకు ఫలితాలు మిశ్రమంగాఉంటాయి.
– ప్రయత్న బలానికి తగ్గట్లుగా రాణిస్తారు. ఉద్యోగంలో పనులను సకాలంలో పూర్తి అయ్యేలా చూసుకోవాలి. వ్యాపారంలోనూ మిశ్రమ ఫలితాలు నమోదవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రేమాభిమానాలతో నడుచుకోవాలి. మనోబలంతో లక్ష్యాల్ని సాధించాలి.
– ఏలినాటి శని దోషం కారణంగా తెలియని ఆటంకాలు చోటు చేసుకుంటాయి.శని శ్లోకం చదువుకోవాలి. రాహుశ్లోకం చదువుకోవటం మంచిది. నవంబరు నుంచి మంచి ఫలితాు ఉంటాయి. తర్వాత మాత్రం శ్రేమ పెరుగుతంది.
కుంభం
అదాయం 11 – వ్యయం 5
రాజపూజ్యం 5 – అవమానం 6
ఆదాయానికి ఢోకా లేదు. అద్భుతమైన ధన లాభాలు ఉంటాయి. స్థిర చరాస్తులు పెరుగుతాయి. లక్ 50 శాతం ఉంది. పనుల్ని అస్సలు వాయిదా వేయొద్దు. అలా అయితేనే లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. విద్యార్థులకు శుభఫలితాలు ఉన్నాయి. ుద్యోగంలో ఏప్రిల్ వరకు ఎదుగుదలకు అవకాశం ఉంది.
– ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. వ్యాపారంలో మొదటి భాగం బాగుంటుంది. పెట్టుబడులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలకు వీలుంది. ఏడాది రెండో అర్థభాగం భాగుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. నవంబరు ద్వితీయంలో కుటుంబ కలహాలు.. ఆర్థిక నష్టాలకు వీలుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. రాహు శ్లోకం చదివితే మంచిది.
మీనం
అదాయం 8 – వ్యయం 11
రాజపూజ్యం 1 – అవమానం 2
ఆదాయం ఉన్నా.. ఖర్చు అంతకు మించి ఉంటుంది. ఇల్లు.. వాహనాలు ఈ ఏడాది కొనుగోలు చేసే వీలుంది. కాకుంటే.. అప్పుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. లక్ పెద్దగా లేదు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాల్సిన అవసరం ఉంది.
– విద్యార్థులకు కలిసి వస్తుంది. ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి కలిసి వస్తుంది. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా.. ఉద్యోగ అవకాశాల్లో భాగంగా విదేశాలకు వెళ్లే వీలుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
– సమిష్ఠి నిర్ణయాలతో ఇంట్లో శాంతి ఉంటుంది. ఏప్రిల్ 23 నుంచి ధన స్థానంలో గురువు ఉండి విశేషమైన కార్యసిద్ధినిస్తాడు. ఏడాది నుంచి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి.