తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమానికి మంగళవారంతో తెరపడింది. సోషల్ మీడియాలో ప్రచారానికి కూడా ఇదే వర్తిస్తున్న నేపథ్యంలో నాయకులందరూ.. ఆయా మీడియాల్లో ప్రచారం చేసి వదిలేశారు. అయితే.. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసినా.. ఆ వెంటనే రెండు వ్యూహాలను పార్టీల నేతలు సిద్ధం చేసుకున్నారు.
ప్రచారం ముగియడం అంటే.. నేతలు మైకులు, వాహనాల్లో ప్రజలను కలుసుకోవడం.. కామెంట్లు చేయ డం వంటివి, సభలు పెట్టడం వంటివి మాత్రమే చేయకూడదు. అయితే..ఇదేసమయంలో పాదయాత్రగా (నాయకుడు మాత్రమే)ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. తమకు ఓటు వేయమని అభ్యర్థిస్తూ.. సందేశాలు కూడా ఇచ్చుకొవచ్చు. అయితే.. ఇవి లిఖిత, రికార్డు పూర్వక సందేశా లు కాకూడదు. దీనికి నాయకులు సమాయత్తం అవుతున్నారు.
ఎక్కడివాహనాలు అక్కడ సర్దుకున్నా.. నాయకులు కీలక ప్రాంతాలను ఎంచుకుని పాదయాత్రగా వెళ్లి ప్రచారం చేసుకోనున్నారు. ఇక, రెండో వ్యూహం.. అందరికీ తెలిసిందే. పంపకాలు. దీనికి కూడా ఏర్పాట్లు చేసినా.. ఎన్నికల సంఘం కూడా అంతే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుని.. నాయకుల ఎత్తులను చిత్తు చేసే ప్రయత్నాల్లో మునిగిపోయింది. అయినప్పటికీ.. నాయకులు మాత్రం పంపకాలకు రెడీగానే ఉన్నారనేది సమాచారం.
అయితే.. ఈ దఫా రూటు మార్చేయడం గమనార్హం. గతంలో తమ అనుచరుల వద్ద నిధులు ఉంచి.. వారి ద్వారా.. పంపకాలు చేసేవారు. కానీ, ఇప్పుడు వారిపైనా ఎన్నికల సంఘం నిఘా పెట్టడంతో.. ఈ వ్యూహం స్థానంలో.. మండలాల వారీగా.. గ్రామాల వారీగా.. తమకు అత్యంత నమ్మకంగా ఓటే సేవారిని ఎంచుకు న్నారు. వారికి ఏదో రూపంలో నగదు చేరవేసి.. వారి ద్వారా పంపకాలు షురూ చేసే కార్యక్రమంలో ఉన్నా రు. ఇక, ఇప్పటికే ఫైనాన్స్ కంపెనీల యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు కూడా.. పంపకాలు పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తానికి ప్రచారం ముగిసినా.. రెండు కీలక వ్యూహాలు మాత్రం మిగిలే ఉన్నాయి.