అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన అధ్యక్ష ఎన్నికలకు ముందు తీవ్ర చిక్కు ల్లో పడిపోయారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియెల్తో సెక్స్ రిలేషన్ పెట్టుకున్న కేసులో కీలకమైన న్యాయార్క్ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అంతేకాదు.. ఈ కేసుతో ముడిపడిన మరో 34 కేసుల్లోనూ ట్రంప్ దోషేనని తెలిపింది. అయితే.. ఈ ఘటన అమెరికా చరిత్రలో మాయని మచ్చగా మారనుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు అధ్యక్షులుగా చేసిన వారు ఎవరిపైనా దోషి అనే ముద్ర పడేలేదు.
ఏం జరిగింది?
పోర్న్ స్టార్ స్టార్మీతో ట్రంప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు దాదాపు రెండేళ్లుగా ఆయనపై ఆరోప ణలు వచ్చాయి. గతంలో అధ్యక్షుడు కాకముందే ఆయన స్టార్మీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని.. అయితే ఈ ఆరోపణలు రాకుండా ఉండేందుకు ఆయన మనీతో మేనేజ్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇదేసమయంలోఆమెకు డబ్బులు ముట్టజెప్పేందుకు 2016 ఎన్నికల్లో పార్టీకి అందిన ప్రచార సోమ్మును కూడా.. ఆమెకు ఇచ్చేశారని మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వ్యాపార నివేదికలను కూడా ఫోర్జరీ చేసినట్టు ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి.
ఇలా మొత్తం 34 కేసులు.. ట్రంప్ పై గత రెండు సంవత్సరాలుగా విచారణలో ఉన్నాయి. వీటిపై పోలీసులు దాఖలు చేసిన చార్జి షీట్లు.. తర్వాత.. జరిగిన సుదీర్ఘ వాదోపవాదనల అనంతరం.. తాజాగా న్యూయార్క్ కోర్టు.. ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఒక్క స్టార్మీ విషయంలోనే కాకుండా.. దీనికి అనుబంధం గా నమోదైన 34 కేసుల్లోనూ ఆయన దోషేనని ప్రకటించింది. ట్రంప్‌తో అక్రమ సంబంధం వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్ ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు ప్రధానంగా పరిగణించింది. దీంతో జూలైలో ఆయనకు శిక్ష ఖరారుచేయనున్నట్టు తెలిపింది.
నాలుగేళ్లు తప్పదా!
ప్రస్తుతం ట్రంప్ దోషి అని తేలిన తర్వాత.. ఆయన కు ఎన్నేళ్లు జైలు పడుతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఈ విషయంపై న్యాయనిపుణులు.. 4-5 ఏళ్లపాటు ట్రంప్‌కు శిక్ష పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యూయమూర్తిదేనని తెలిపారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా తో సరిపుచ్చే అవకాశం ఉందని మరో న్యాయ నిపుణులు పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయొచ్చా?
ప్రస్తుతం కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు వరకు ఉంటాయి. నవంబరులో తుది ఫలితం రానుంది. ఇప్పుడు ఈ పోటీలో కీలకంగా ఉన్న ట్రంప్.. దోషి అని తేలిన నేపథ్యంలో ఆయన పోటీ చేయొచ్చా? అనే సందేహం ఉంది. దీనిపై పలువురు న్యాయనిపుణులు మాట్లాడుతూ.. అమెరికా చట్టాల్లో పోటీ చేయకూడదని ఏమీ లేదన్నారు. 1920లో సోషలిస్ట్ నేత జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశారని తెలిపారు. అయితే.. ప్రస్తుత పరిణామం.. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందని, తద్వారా ట్రంప్ ఓటు బ్యాంకు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.