నివురుగప్పిన నిప్పుకణికలా ఠక్కున పార్టీని ఇరుకున పెడుతూ సంచలన కామెంట్లు చేశారు టీఆర్ఎస్ నేత ధర్మపురి శ్రీనివాస్. మా పార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ghmc elections ముందు ఆయన ఈకామెంట్లు చేయడం సంచలనం అయ్యింది.
ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే అసంతృప్తి అనేది వస్తుందని, ప్రజల్లో అసంతృప్తికి కారణం ప్రభుత్వం పనిచేయకపోవడం వల్లే అన్నారు. ghmc ఎన్నికలను నిర్వహిస్తున్న తీరు కూడా దారుణంగా ఉందన్నారు. వరద సాయాన్ని అందించిన తర్వాతే ఎన్నికలు పెట్టి ఉండొచ్చు కదా అని డీఎస్ వ్యాఖ్యానించారు.
వరద బాధితులకు సహాయం అందకుండా హడావుడిగా ఎన్నికలు పెట్టి వారికి ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. 68 వేల కోట్ల అభివృద్ధి జీహెచ్ఎంసీలో ఎక్కడ కనిపిస్తోందో అర్థం కావడం లేదన్నారు. ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ సర్కారే అన్నారు. ఇపుడు వాటి నిర్వహణ కూడా సరిగ్గా లేదన్నారు.
కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి. కానీ ఆయన ఆలోచనలు ఎపుడూ కేంద్రం చుట్టు తిరుగుతున్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాలకు ఆనుకుని ఉన్న దుబ్బాకలో ఓడిపోయాం అంటే ప్రజల్లో ఎంత అసహనం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. నన్ను టీఆర్ఎస్ ఎపుడో మరిచిపోయింది. ప్రజల్లో టీఆర్ఎస్ విశ్వసనీయతను కోల్పోయింది.