టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, చైన్నై సుందరి త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం `అతడు`. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. కానీ, స్మాల్ స్క్రీన్‌పై మెగా హిట్‌గా నిలిచింది. గడిచిన ఇరవై ఏళ్లలో వంద, రెండు వందలు కాదు ఏకంగా పదిహేను వందల సార్లు టీవీల్లో ప్రసారమై అదిరిపోయే రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చే అతడు మూవీలో మహేష్ బాబు-త్రిషల కెమిస్ట్రీ, వారి మధ్య వచ్చే సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.
అతడు తర్వాత మహేష్ బాబు, త్రిష్ జంటగా చేసిన మరో సినిమా `సైనికుడు`. అయితే ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ దెబ్బతో మరోసారి మహేష్ బాబు, త్రిష కలిసి నటించలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. మహేష్ బాబుకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ను అందరితో పంచుకుంది. తన ఫేవరెట్ కోస్టార్స్ లో మహేష్ బాబు ఒకరిని.. అతను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని త్రిష కొనియాడింది.
అలాగే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే తనకు, మహేష్ కు పరిచయం ఉందని త్రిష పేర్కొంది. కాలేజీ డేస్ లో మహేష్ బాబు, త్రిష చెన్నైలోనే ఉండవారట. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండటంతో.. వారి ద్వారా మహేష్ బాబుతో త్రిషకు పరిచయం ఏర్పడిందట. అంత క్లోజ్ కాకపోయినా హాయ్, బాయ్ చెప్పుకునేంత ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్య ఉండేదని.. ఇక ఆ సమయంలో తాము యాక్టర్స్ అయ్యి జంటగా నటిస్తామని ఊహించలేదంటూ త్రిష ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.