దీపావళి కానుకగా ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల్లో `అమరన్` ఒకటి. 2014 జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అమరులైన మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథతో రూపొందిన చిత్రమే అమరన్. ఇందులో ముకుంద్ పాత్రను కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ పోషించగా.. అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ గా సాయి పల్లవి నటించింది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడిగా వ్యవహిరంచాడు.
వివిధ భాషల్లో అక్టోబర్ 31న రిలీజ్ అయిన అమరన్.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ట్రూ ఎమోషన్స్ తో సాగే డీసెంట్ ఆర్మీ డ్రామాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలిసిన కథ, ఘట్టాలే అయినా.. ఆడియెన్స్ ను ఆకట్టుకునే విధంగా కథనాన్ని నడిపించిన విధానం దర్శకుడి పనితనానికి నిదర్శనం. టాక్ పాజిటివ్ గా ఉండటంతో కలెక్షన్స్ పరంగా అమరన్ అదరగొడుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అమరన్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. మేజర్ ముకుంద్ పాత్రకు శివ కార్తికేయన్ వంద శాతం న్యాయం చేశాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో అద్భుతంగా మెప్పించాడు. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మేజర్ ముకుంద్ పాత్రకు ఫస్ట్ ఛాయిస్ శివ కార్తికేయన్ కాదట. మొదట టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో అమరన్ మూవీని తెరకెక్కించాలని డైరెక్టర్ భావించాడట.
పుష్ప రిలీజ్ కి ముందే ఈ సినిమా కథని ఆయనకీ చెప్పాలని అనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ అపాయిట్మెంట్ దొరక్కపోవడం, ఇంతలో పుష్ప విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడం, అల్లు అర్జున్ ఇమేజ్ అమాంతం పెరిగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత పుష్ప 2 తో అల్లు అర్జున్ బిజీ కావడంతో.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి సెకండ్ అప్షన్ గా శివ కార్తికేయన్ ను ఎంచుకోవడం జరిగిందట. ఈ విధంగా అమరన్ వంటి హిట్ మూవీని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు.