నాగార్జున హిట్ కొట్టి దాదాపు ఆరేళ్లు అవుతోంది. నాగార్జున తాజా సినిమా ఘోస్ట్ డిజాస్టరైన విషయం తెలిసిందే. 2016లో విడుదలైన ఊపిరి తర్వాత అతను హిట్ కోసం మొహం వాచిపోయి ఉన్నారు.
ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2, ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2, వైల్డ్ డాగ్, బంగార్రాజు మరియు ద దెయ్యం వంటి చిత్రాల అన్నీ నాగార్జునను నిరాశకు గురిచేశాయి.
ఒక్క బంగార్రాజు సినిమా మాత్రమే ఒక మోస్తరు పేరు తెచ్చింది. మిగిలిన చిత్రాలన్నీ ఘోర పరాజయాలే. అతని తాజా చిత్రం దసరా సందర్భంగా విడుదలైన ఘోస్ట్ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దసరా సెలవులు కూడా సినిమా పరువును కాపాడలేకపోయాయి. చివరకు విసిగిపోయిన నాగ్ ఫ్యాన్సే నాగ్ ను ట్రోల్ చేస్తున్నారు.
సినిమాల ఎంపిక మీకు రావడం లేదని, ఇక సినిమాలు చేయొద్దని… సోషల్ మీడియాలో నాగార్జునని అతని హార్డ్ కోర్ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
నాగార్జున వయసు 60 దాటింది. కాబట్టి అతను తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. మునుపటిలా అన్ని జానర్లు ఆయనకు సూటు కావు.
నాగార్జున త్వరలో తన తదుపరి చిత్రం గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాతో కలిసి పని చేస్తారట. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. నాగార్జున చర్చల దశలో ఉన్న రెండు వెబ్ ఆధారిత ప్రాజెక్ట్‌ల కోసం కూడా చర్చలు జరుపుతున్నారు.