విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారరా.. అబ్బో ఆ ఊహే వేరే లెవెల్ లో ఉంది. అయితే ఆ ఊహను రియాల్టీలోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారో డైరెక్టర్. ఇంతకీ ఆయన మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో క్రేజీ హిట్ అందుకున్న వెంకీ.. ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.
అయితే ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకీ తదుపరి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. వెంకీ కోసం త్రివిక్రమ్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఇది సోలో మూవీ కాదు.. మల్టీస్టారర్ అని, వెంకీ-చెర్రీ కలిసి నటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సాంప్రదాంపులు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` మూవీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఒకవేళ ఆయన త్రివిక్రమ్ సినిమాకి ఓకే చెబితే.. డేట్లు ఏ విధంగా సర్దుబాటు చేస్తారు? గెటప్ ను ఎలా కంటిన్యూ చేస్తారు? అన్న ప్రశ్నలు ప్రధానంగా తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందంటే వెంకటేష్-రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబో ముందుకు సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.