ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండు రోజుల తర్వాత కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న వైనం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, ఈ నేపథ్యంలోనే ఏపీ డీజీపీ, ఏపీ సీఎస్ లను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచి వివరణ కూడా కోరిందన్న సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు…కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసిపి నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో కొనసాగుతున్న హింసపై ప్రముఖ సినీ నటుడు నరేష్ స్పందించారు. ఏపీలో తాను ఊహించినట్లుగానే అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని నరేష్ అన్నారు. ఎన్నికల పోరులో ఓటర్లు తీర్పు ఇచ్చారని, ప్రజలకు ఇష్టమైన నాయకులు గెలవాలని కోరుకుంటున్నానని నరేష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆందోళనకర పరిస్థితులు తొలగిపోయి శాంతియుత వాతావరణం నెలకొనాలని నరేష్ ఆకాంక్షించారు.
ఎన్నికలకు కొద్దిరోజుల ముందే పోలింగ్ తర్వాత ఏపీలో అధికార మార్పిడి సమయంలో హింస జరిగే అవకాశం ఉందని నరేష్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే ఏపీలో పోలింగ్ ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత కూడా హింస కొనసాగతో మరోసారి నరేష్ స్పందించారు. కూటమి గెలుపు కోరుతూ నరేష్ పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.