కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ నటుడు, హీరో కృష్ణుడుపై రేప్ ఆరోణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. గతంలో తనను 139 మంది గత ఎనిమిదేళ్లుగా 5000 సార్లుకు పైగా రేప్ చేశారంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి చేసిన ఫిర్యాదులో కృష్ణుడుతోపాటు పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా వినిపించాయి. అయితే, ఆ తర్వాత అదంతా ఫేక్ అని తేలడంతో కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
తనపై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించాలని, నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ తరహా వ్యాఖ్యలు తన కుటుంబంపై ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణుడి పేరు మరో వ్యవహారంలో తెరపైకి వచ్చింది. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారని ప్రచారం జరుగుతోంది.
ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయగా….ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజుతో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులకు దొరికారని తెలుస్తోంది. కృష్ణుడుతో సహా వారందరినీ అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలుస్తోంది. అయితే, కృష్ణుడు అరెస్టు విషయాన్ని పోలీసులు అధికారంంగా ధృవీకరించలేదు.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం మియపూర్ పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి లక్షా 97 వేల రూపాయల నగదుతోపాటు 8 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారందరిరనీ పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు తరలించి అక్కడి నుండి రిమాండ్కు తరలించారు. కృష్ణుడు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. మరి, గతంలో లాగా ఇది కూడా ఫేక్ న్యూసా లేక నిజమేనా అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే.