హీరోలకు ఏమాత్రం తీసిపోని పర్సనాలిటీ ఉన్నప్పటికీ విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సత్తా చాటుతున్న నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఈ జాబితాలో అజయ్ ఒకరు. విజయవాడ వాసి అయిన అజయ్.. సినిమాలపై ఉన్న పిచ్చితో ఇంజనీరింగ్ డ్రాపౌట్ అయ్యాడు. హైదరాబాద్ లోని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ అభ్యసించాడు. దర్శకుడు వేమూరి జ్యోతి కుమార్ తో అజయ్ తండ్రికి పరిచయం ఉండడంతో.. కౌరవుడు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. కానీ ఈ సినిమా అతనికి ఎటువంటి గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయింది.
అయితే ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించి అజయ్ గుర్తింపు పొందాడు. 2006లో వచ్చిన విక్రమార్కుడు చిత్రం అజయ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో అజయ్ నిజంగానే ప్రేక్షకులను భయపెట్టేశాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. అలాగే తమిళ్, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాల్లో అజయ్ నటించాడు.
ఇప్పటికీ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన దేవర సినిమాలోనూ ఆఫీసర్ శివంగా అలరించాడు. ఇక అజయ్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు.. 2005 లోనే అజయ్ కు వివాహం జరిగింది. ఆయన బ్యూటిఫుల్ వైఫ్ పేరు శ్వేత రావూరీ. గతంలో మోడల్ గా ఆమె వర్క్ చేశారు. 2017 మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లారు.
అజయ్, శ్వేత దంపతులకు సోహన్, ధీరన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. శ్వేత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. భార్య, పిల్లలతో వెకేషన్స్ కు వెళ్లడం అజయ్ కు మహాఇష్టం.
View this post on Instagram