వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కీలకమైన విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ప్రజాబాంధవుడిగా పేరు తెచ్చుకున్న కేశినేని శివనాథ్.. ఉరఫ్ చిన్ని బలాబలాలు ఏంటి? ఆయన విజయం దక్కించుకునేందుకు తోడ్పాటు నందించే వ్యూహాలు ఏంటి? అనే విషయాలు పరిశీలిస్తే.. ఆయన చేసిన సేవ, ప్రజలకు.. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఆయన అందించిన సాయం వంటివి కనిపిస్తున్నాయి. ఇవే ఆయనను గెలిపిస్తాయని కూడా అంటున్నారు.
గత మూడున్నరేళ్లుగా నిర్విరామంగా కేశినేని చిన్ని ప్రజల్లోనే ఉన్నారు. కరోనాతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో రాజకీయంగా అడుగు పెట్టిన ఆయన గ్రామీణ స్థాయిలో నిరుపమానమైన సేవలు అందించా రు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో.. అనేక గ్రామాల్లో ఆయన సేవలను విస్తృతం చేశారు. ఎక్కడా ఎలాంటి వివక్ష చూపకుండా.. సొంత నిధులతో ఆయన ప్రజలకు అనేక మౌలిక సౌకర్యాలు కూడా కల్పించారు. బోర్లు వేయించారు.. పాఠశాలలకు రోడ్లు వేయించారు.
ఇక, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల వైద్యానికి కూడా ఆర్థికం సాయం అందించారు. అదేవిధంగా ఏ పండగ వచ్చినా.. జాతీయ పర్వదినాలు వచ్చినా.. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. వృద్ధులు, దివ్యాంగులకు పండ్లు, బట్టలు పంచుతూ.. తన ఉదారతను చాటుకున్నారు. ఎవరు ఆయన ఇంటి తలుపు తట్టినా, కార్యాలయం తలుపు కొట్టినా.. వారి సమస్యను పరిష్కరించేందుకు నేనున్నానంటూ.. ముందుంటారు. చేతిలో ఎలాంటి అధికారం లేకపోయినా.. ఆయన సాయానికి ముందుంటారనే పేరు తెచ్చుకున్నారు.
ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. ఆయన అజాత శత్రువు. అందరినీ కలుపుకొని పోవడంలోనూ.. కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలోనూ ఆయన ముందున్నారు. ప్రతి చిన్న విషయం కూడా ఆయన ఎంతో శ్రద్ధగా వింటారు. నేనున్నానంటూ.. కార్యక్తలకు అండగా నిలుస్తున్నారు. ఇక, ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ కేశినేని చిన్ని .. ఒక ఐకాన్‌గా మారారు. దీంతో ఆయన ఎంపీగా గెలిచి తీరడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీలోనూ అన్ని వైపుల నుంచి సహకారం స్పష్టంగా కనిపిస్తున్న దరిమిలా.. చిన్ని గెలుపును ఎవరూ ఆపలేరని అంటున్నారు.