టాలీవుడ్ డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ `ది రాజా సాబ్`. ప్రభాస్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తుండగా.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న రాజా సాబ్ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ, షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో మూవీ రిలీజ్ ఆలస్యం అయింది.
అయితే తాజాగా సినిమా విడుదలకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5న లో ప్రపంచవ్యాప్తంగా రాజ్ సాబ్ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. అలాగే టీజర్ ను జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను వదిలారు. ఇందులో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇకపోతే సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ `ఓజీ` వస్తుండటంతో `అఖండ 2` డిసెంబర్ వైపు చూస్తోంది. దాంతో రాజ్ సాబ్ మేకర్స్ ముందే కర్చీఫ్ వేసేశారు. పైగా అదిరిపోయే స్ట్రాటజీతో సోలో రిలీజ్ డేట్ ను ఎంచుకున్నారు. ప్రభాస్ నటించిన `బాహుబలి` నుంచి `కల్కి` వరకు అన్ని చిత్రాలకు సోలో రిలీజ్ డేట్ అనేది బాగా కలిసొచ్చిన అంశం. టాక్ అటు ఇటుగా వచ్చిన సోలోగా రావడం వల్ల వసూళ్ల పరంగా `సాహో`, `రాధేశ్యామ్`, `ఆదిపురుష్` చిత్రాలు ఓకే అనిపించాయి. ఇప్పుడు తెలివిగా రాజా సాబ్ ను కూడా సోలో రిలీజ్‌కు ముస్తాబు చేస్తున్నారు. ఇది కలెక్షన్స్ కు చాలా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.