చాలా కాలం తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య `తండేల్` మూవీతో హిట్ అందుకున్నాడు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా దేశభక్తికి ప్రేమ కథను జోడించి చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన తండేల్ ఫిబ్రవరి 7 నా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ముఖ్యంగా నాగచైతన్య, సాయి పల్లవిల యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, డైరెక్టర్ మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తండేల్ లో చైతూ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక అన్ సీజన్ అయినా కూడా టాక్ అనుకూలంగా ఉండటం, పోటీగా మరే సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తండేల్ తగ్గేదే లే అంటూ దూసుకుపోతోంది.
ఐదు రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. ఏపీ మరియు తెలంగాణలో తండేల్ చిత్రానికి ఐదు రోజుల్లో రూ. 30.37 కోట్ల షేర్, రూ. 48.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రూ. 13.20 కోట్లు, సీడెడ్లో రూ. 4.21 కోట్లు, ఉత్తరాంద్రలో రూ. 4.37 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 2.28 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 1.68 కోట్లు, గుంటూరులో రూ. 1.84 కోట్లు, కృష్ణలో రూ. 1.73 కోట్లు, నెల్లూరులో రూ. 1.06 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి
అలాగే వరల్డ్ వైడ్ గా ఐదు రోజుల్లో రూ. 37.64 కోట్ల షేర్, రూ. 65.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లోనే రూ. 4.02 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 38 కోట్లు కాగా.. తండేల్ దాదాపు టార్గెట్ ను రీచ్ అయింది. మరో రూ. 36 లక్షలు వస్తే బాక్సాఫీస్ వద్ద చైతూ మూవీ క్లీన్ హిట్ గా నిలిచి లాభాల బాట పట్టడం ఖాయమవుతుంది.