ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనలు ముగించుకున్నారు. ఇక, మలిదశలో ఆయన వచ్చే వారం నుంచి కృష్ణాజి ల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పామర్రు, నూజివీడు, పెడన, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకం అవుతారు. వారి సమస్యలు తెలుసుకుంటారు. అదేసమయంలో జిల్లోలో సమస్యల పరిష్కారంపైనా ఆయన దృష్టి పెట్టనున్నారు.
అంతేకాదు.. జిల్లాలో తన హయాంలో సాగి న అభివృద్ధిని కూడా చంద్రబాబు వివరించనున్నారు. ఇక, ఇదేసమయంలో కీలకమై న గుడివాడ నియోజక వర్గంలో మినీ మహానాడును నిర్వహించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకిస్తుండగా.. జిల్లాలో రాజకీయ టెన్షన్ కు కారణంగా మారింది. ఇప్పుడు గుడివాడలో నిర్వ హించే మినీ మహానాడు పైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిత్యం చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు గుప్పించే మాజీ మంత్రికొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో చంద్రబాబు ఏం చెబుతారు? ఏం మాట్లాడతారు? అనేది చర్చగా మారింది.
సంక్రాంతి సమయంలో ఇక్కడ కేసినో నిర్వహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై అప్పట్లలో టీడీపీ నేతలు.. వైసీపీ నాయకుల మధ్య తీవ్రస్తాయిలో పొలిటికల్ ఫైట్ నడిచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని.. తమ్ముళ్లే చెబుతుండడం గమనార్హం. ఇదిలావుంటే.. మాజీ మంత్రి కొడాలి నాని అడ్డాలో జరుగుతున్న మినీ మహానాడును అడ్డుకునే ప్రయత్నాలు సాగే అవకాశం ఉంటుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. రాజకీయంగా.. నాని.. తరచుగా.. చంద్రబాబు టార్గెట్ చేయడం.. దూషణలతో విరుచుకుపడడం వంటివి చూస్తేనే ఉన్నాం.. సో.. నాని అడ్డుకునే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
అయితే.. నాని కానీ.. ప్రభుత్వం కానీ.. ఎలాంటి అడ్డంకులు సృష్టించినా.. మినీ మహానాడును నిర్వహించే తీరాలనే పట్టుదలతో టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గుడివాడ రాజకీయం వేడెక్కింది. మరి చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందో.. మినీ మహానాడు నిర్వహణ ఎలా ఉంటుందో చూడాలి.