పల్నాడు జిల్లాలో టీడీపీ యువ నాయకుడు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారాలోకేష్ పర్యటించారు. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత.. పల్నాడులో లోకేష్ పర్యటిస్తుండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. గజ మాలలతో ఆయనకు స్వాగతం పలికారు. మండలాలు, గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత లోకేష్‌ను చూసేందుకు తరలి రావడం గమనార్హం. అయితే.. పోలీసులు యధావిధిగా తమ ప్రతాపం చూపించారు.
ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆకాంక్షలు విధిస్తున్నామంటూ.. 5 కిలో మీటర్ల దూరంలోనేతమ్ముళ్లు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. దీంతో పార్టీ కార్యకర్తలునడిచి.. లోకేష్ పర్యటనకు వచ్చే ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇదిలావుంటే.. సత్తెనపల్లి నియోజవర్గంలో కోడెల శివరామకృష్ణ కార్యలయంలో టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు అందించారు. లోకేష్ నిర్వహించే ర్యాలీలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ నోటీసులను కోడెల శివరామ్ తిరస్కరించారు. దీంతో పోలీసులు ఆయనను నిర్బంధించే ప్రయత్నం చేశారు. అయితే.. కార్యకర్తలుఎదురు తిరగడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు.. గుంటూరుకుచేరుకున్న నారా లోకేష్.. కంటేపూడి నుంచి సత్తెనపల్లి మీదుగా ర్యాలీ ..నిర్వహిస్తున్నారు. పల్నాడులో ఇటీవల హత్యకు గురైన జాలయ్య యాదవ్ కుటుంబాన్ని లోకేష్ గురువారం పరామర్శించనున్నారు.