కర్ణాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే నెల 10న ఎన్నికలు.. తర్వాత రెండు రోజులకే ఫలితం రానుంది. ఈ ఎన్నికలు.. రాష్ట్రానికే పరిమితం అయినప్పటికీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిజానికి కర్ణాటక ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే సాగుతున్నా.. ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితం మాత్రం దేశవ్యాప్తంగా ప్రభావితం చూపించే అవకాశం ఉంది.
రాజకీయ పొత్తులు.. ఎత్తులు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం దిక్సూచిగా మారనుంది. ఇదొక పరిణామం అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దూకుడు కారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఇక, ఇదే బీజేపీ సహకారంతో తనకు తిరుగులేదన్నట్టు వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.
కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని కోరుకునే పార్టీలు.. కాదు గెలిచి నిలవాలని భావించే పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూకనిపిస్తున్నాయి
కానీ, కర్ణాటకలో ఇప్పుడు ఆ అభివృద్ధి అనే మాట పోయింది. కులాలకు రిజర్వేషన్లు.. మతాల ప్రాతిపదిక న పోరాటాలు.. టిప్పు సుల్తాన్ వ్యవహారం, హిజాబ్ అంశం, ప్రభుత్వ అవినీతి వంటివే ప్రధానంగా వినిపి స్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు కూడా.. వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపరేషన్ పై ఈ అంశాలను అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కీలక అధికారులు బెంగళూరులో తిష్ఠవేసి.. వారం రోజులుగా అక్కడ జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.