కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కేసులను నిలువరించేందుకు, కరోనా వ్యాప్తిని అరికట్టేం దుకు కేసీఆర్ ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. బుధవారం అమ లులోకి వస్తున్న దీని నుంచి కొన్ని వర్గాలకుసీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చారు.
ప్రస్తుతం కేవలం 10 రోజులు మాత్రమే లాక్డౌన్ను అమలు చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ పదిరోజులు కూడా ఉద యం 6-10(కేవలం నాలుగు గంటలు) పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత నుంచి పూర్తిగా లాక్డౌన్ అమల్లోకి వస్తుంది.
ఇక, ఈ లాక్డౌన్లో ప్రభుత్వం కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చింది. దీనిలో ప్రధానంగా… వ్యవసా యానికి పెద్దపీట వేసింది. వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు, ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా సాగుతాయి.
వ్యవసాయ రంగానికి:
+ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు. రైస్ మిల్లుల నిర్వహణ, ధాన్యం రవాణా,
+ ఫెర్టిలైజర్, విత్తన దుకాణాలు, విత్తన ఉత్పత్తి కర్మాగారాలకు లాక్డౌన్ వర్తించదు.
+ ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగిస్తారు.
వైద్య రంగం:
+ వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
మౌలిక రంగాలు:
+ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
+ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
రవాణా:
+ జాతీయ రహదారుల మీద రవాణా యథావిథిగా కొనసాగింపు
+ జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు తెరిచే ఉంటాయి.
+ కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
+ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
+ ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
+ బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
+ పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి అనుమతి
+ అంత్యక్రియలకు గరిష్టంగా 20 మందికి అనుమతి.
6-10 ఏదైనా ఓకే!
+ ఉదయం 6-10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా ఉంటుంది.
+ ఉదయం 6-10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
ఇవి.. పూర్తిగా బంద్!
+ సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు