తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తన పరువు తానే తీసుకోవటం మహా సరదాగా అనిపిస్తోంది. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే నిదర్శనం అని చెప్పాలి. అసలు ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని ఓ పోల్ పెట్టారో కాని.. ఆ పోల్ కాంగ్రెస్ పరువు తీసేసింది. ముందునుంచి కూగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్‌గా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయం మరోసారి పార్టీ అధికారంలో ఉండి కూడా నిజం అని ఫ్రూవ్ అయ్యింది. అసలు విషయం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్‌గా ఓ పోల్ పెట్టింది.
ఆ పోల్ సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ? ఇందులో రెండు ఆన్సర్లు ఉన్నాయి. ఒకటి ఫార్మ్ హౌస్ పాలన కావాలా లేదా ప్రజల వద్దకు పాలనా అని ప్రశ్నించింది. అయితే ఈ పోల్ లో విచిత్రంగా ఓటు వేసిన వాళ్లలో 67 శాతం ఫార్మ్ హౌస్ పాలన కావాలని కోరుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కాంగ్రెస్ అధికారికంగా పెట్టిన పోస్టులోనే తమకు 67 శాతం మంది కాంగ్రెస్ పాలన వద్దని తేల్చి చెప్పినట్లైంది. కనీసం ఈ పోస్ట్ పెట్టేటప్పుడు కాంగ్రెస్ తమ సోషల్ మీడియాను యాక్టివ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదని క్లీయర్‌గా తెలుస్తోంది.
అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పదేళ్ల అనుభవంతో సోషల్ మీడియా మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. అబద్దాలను కూడా నిజంగా చెప్పే ప్రయత్నం చేసే విషయంలో అయినా.. తమ అభివృద్ధి చెప్పుకునే విషయంలో అయినా బీఆర్ఎస్కు అస్సలు తిరుగులేదు. బీఆర్ఎస్ యువనేత కేటీఆర్ సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటారు… అసలు బీఆర్ఎస్ మెయిన్‌గా సోషల్ మీడియాతోనే ఎక్కువుగా రాజకీయం చేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ ఈ విషయంలో ఎంత దారుణంగా ఉందో తాజా పోస్ట్ ఉదంతమే చెపుతోంది. రేవంత్‌కు ఇది కాంగ్రెస్ కామెడీగా ఇచ్చిన ఝులక్ అంటున్నారు.
ఇక ఈ పోస్ట్ పక్కన పెడితే కాంగ్రెస్ తన పరువు తానే తీసుకున్నట్టు అయ్యింది. ఈ పోల్ లో ఓటు వేసిన మొత్తం 92551 ఓట్లలో…62010 (67%) మంది రేవంత్ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు పాలనపై పెదవి విరుస్తున్న వివిధ వర్గాల వారికి మరింతగా ఈ పోస్ట్‌తో ఆయుధం లభించినట్లయ్యింది. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ కొట్టుకుందన్న సెటైర్లు బాగా పేలుతున్నాయి.