సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా సరే హీరోయిన్లకు నటిమణులకు చాలామందికి కమిట్మెంట్, క్యాస్టింగ్ కోచ్ అనేవి ఎదురవుతాయని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు, ఈ విషయంపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు హీరోయిన్లు బహిరంగంగానే స్పందించి సంచలన ప్రకటనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలోనే టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేం తేజస్వి మదివాడ నటించిన ‘కమిట్మెంట్’ అనే సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమిట్మెంట్ పై తేజశ్రీ మదివాడ సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ఉందని తేజస్వి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తాను కూడా ఇండస్ట్రీలో ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని, సినీ పరిశ్రమంలో కమిట్మెంట్ అడుగుతారు అన్నది పచ్చి నిజమని షాకింగ్ కామెంట్లు చేసింది.
తనని కూడా ఎంతోమంది కమిట్మెంట్ అడిగారని, ఒక్క సినీ రంగంలోనే కాదు ప్రతి రంగంలో కూడా ఇలాంటి కమిట్మెంట్ అడిగే వారు ఉంటారని సంచలన విషయాలు వెల్లడించింది. అయితే, కమిట్మెంట్ కి లొంగిపోకుండా ధైర్యంగా ఉండాలని, అలాంటివారికి లొంగిపోయి తర్వాత మోసపోయామని చెప్పడం సరికాదని తేజస్వి అభిప్రాయపడింది. సినిమాల్లోనే కాదు తాను ఈవెంట్లకు వెళ్ళిన సందర్భంలోనూ కొందరు తాగుబోతులు తన చుట్టు చేరి వేధించే వారని, వారి నుంచి తప్పించుకునేందుకు చాలా కష్టపడేదాన్ని అని చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలకు అందరికీ ఒక సందర్భం వస్తుందని, కమిట్మెంట్ అడగడం, మనతో తప్పుగా ప్రవర్తించడం చేస్తారని చెప్పింది. అయితే, అప్పుడు లొంగిపోయి తర్వాత నాకు అన్యాయం జరిగింది అని ఫైట్ చేయకూడదని, అది తప్పు అనిపిస్తే ఆ క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సూచించింది. అలా కాదని తప్పుచేసి తనను అందరూ వాడుకున్నారని తర్వాత చెప్పడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పింది.ౌ
అసలు కమిట్మెంట్ అనేది మనకు ఇవ్వాలని లేకపోతే అడిగే వారు కూడా ఉండరని తాను కూడా అలాంటి పరిస్థితిని ఫేస్ చేశాను కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను అని తెలిపింది. ఏదేమైనా కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ చేసిన హాట్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి