• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

“ఇదేం ఖ‌ర్మ‌“తో టీడీపీ ఏం చేయ‌నుంది?  స‌ర్వ‌త్రా ఆస‌క్తి!

NA bureau by NA bureau
November 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
TDP programme idem karma

idem karma poster

0
SHARES
422
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. “ ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి“ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు తాజాగా ప్రారంభించారు.

50 రోజుల్లో రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలను ఈ కార్యక్రమంలో భాగంగా కలవాలని నిర్దేశించారు. డిసెంబరు 1న దీనిని క్షేత్ర స్థాయిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించాలని టీడీపీ తలపెట్టింది.

దీనిలో భాగంగా పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో వీలైనన్ని కుటుంబాల వద్దకు వెళ్లి వారి సమస్యలను, కష్టాలను తెలుసుకొని అండగా ఉంటామని భరోసా ఇస్తారు. కొన్ని సమస్యలను పార్టీ బృంచాలు తామే ప్రస్తావించి రాష్ట్రంలో పరిస్థితులను వివరించి మనందరికీ “ఏమిటీ ఖర్మ“ అని వివరించాలని నిర్ణయించారు.

ఉద్యోగ ఉపాధి అవకాశాలు మృగ్యమై రాష్ట్రంలో నిరు ద్యోగు తాండవించడం, మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు వివరీతంగా పెరిగిపోయి శాంతిభద్రతలు క్షీణిస్తున్న తీరు, ధ‌రలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల జీవితాలు దుర్భరం కావడం వంటి కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తారు.

అదేవిధంగా.. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోవడానికి తోడు గంజాయి వంటి మత్తు పదార్థాలు విశృంఖలంగా వ్యాపించి యువత, పిల్లలు వ్యసనపరులు అవుతుండటం, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఘోరంగా తయారు కావడం, ఇనుక రేటు నాలుగు వందల శాతం పెరిగిపోయి ఇసుక మాఫియా కొల్లగొట్టడం, రాజధానుల పేరుతో మూడు ముక్కలాట, నిధుల లూటీని ప్రశ్నించిన వారిపై పోలీసుల‌ను ప్రయోగించడం, పోలీసులతో గొంతు నొక్కించడం, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం, గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి అద్వాన్నం కావడం వంటి అంశాలను టీడీపీ బృందాలు ప్రజల వద్ద ప్రస్తావించనున్నాయి.

ఇవికాక ప్రజలు తమకు తాముగా మరేవైనా సమస్యలు ప్రస్తావిస్తే వాటిని కూడా ఈ బృందాలు నమోదు చేసుకొంటాయి. జగన్ ప్రభుత్వంలో తమను బాధించే అంశాలేమిటి అన్నదానిపై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాయి.

రాష్ట్రంలో అన్నిచోట్ల నుంచి ఈ సమాచారం వచ్చిన తర్వాత దానిని క్రోడీకరించి గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాని, రాష్ట్రపతుల్లో ఎవరికైనా ఒకరికి పంపిస్తారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రతి కుటుంబం “ఏమిటి ఖ‌ర్మ‌“ అనుకొనే దుస్థితి దాపురించిందని, ఈ దుస్థితికి వైసీపీ ప్రభుత్వ అసమర్థ అవినీతి అరాచక పాలనే కారణమని ప్రజలు గుర్తించేలా చేయడానికి దీనిని చేపట్టారు.

పార్టీ త‌ర‌ఫున‌ మొత్తం 8 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 50 ల‌క్ష‌ల కుటుంబాల‌ను క‌లిసి మాట్లాడాలన్నది లక్ష్యగా పెట్టుకున్నారు. అన్ని వనరులు ఉన్నా రాష్ట్ర వెనుకబడిపోయిందని, ప్రతి వర్గం అసహనంతో ఉందని, ఎవరినీ వదిలిపెట్టకుండా పిండుతున్నారని… సామాన్యులను కూడా బాదుతున్నారని, తమను రసగుల్లాల మాదిరిగా నమిలేను న్నారని వ్యాపారులు బాధపడుతున్నారని.. వంటి కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తారు.

దుర్మార్గ పాలనలో రాష్ట్రానికి "ఇదేం ఖర్మ" .. pic.twitter.com/34ha8Mmavc

— iTDP Official (@iTDP_Official) November 19, 2022

ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా స్వ‌యంగా 25 నియోజకవర్గాల్లో ప‌ర్య‌టించి `ఇదేం ఖ‌ర్మ‌` కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ప‌నిలో ప‌నిగా ఈ కార్యక్రమంలో పార్టీ నేతల పనితీరును కూడా నిశితంగా పరిశీలిస్తారు. నాయకుల సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి ఇదొక కొలబద్ద‌గా భావించ‌నున్నారు.

ప్రజల్లోకి వెళ్లినప్పుడు స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతి, దౌర్జన్యాలు, తప్పిదాలపై కూడా టీడీపీ నేతలు ఖచ్చితంగా ప్ర‌శ్నించాల‌ని నిర్ణ‌యించారు. వారిపై పోరాడకపోతే ప్రజల్లో విశ్వాసం రాదని, ప్రజల్లో విశ్వాసం పొందలేనివారికి టికెట్లు ఇచ్చినా గెలవలేరని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

“అధికార పార్టీ నేత‌లు వలంటీర్లపై అధికంగా ఆధారపడుతున్నారు. మనం ప్రతి ఇంటితో సుబంధ బాంధవ్యాలు పెట్టుకొని తరచూ పలకరిస్తూ ఉంటే వలంటీర్ల ప్రభావం తగ్గించగలుగుతాం. ఈ కార్యక్రమంలో మనకు అందే సమాచారం మన ఎజెండాను ఖ‌రారు చేసుకోవడానికి.. రేపు మేనిఫెస్టోను రూపొందించుకోవడానికి కూడా పనికివస్తుంది’ అని చంద్ర‌బాబు వివరించారు. ఈ కార్య క్రమం కోసం ఒక ఫోన్ నంబర్‌ కూడా కేటాయించారు. 13612 32612 అనే ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ బృందాలు సంప్రదిస్తాయి.

Tags: ఆంధ్రప్రదేశ్ఇదేం ఖర్మక‌ర్నూలుచంద్రబాబుతెలుగుదేశం
Previous Post

ఏంటి నాగ్‌ .. నెక్స్ట్ ఉందా..లేదా..?

Next Post

ఓడిన సర్పంచ్ కి 2 కోట్ల కారు గిఫ్టుతో ఓదార్పా ? ఎందుకు?

Related Posts

nara lokesh yuvagalam1
Trending

యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!

December 1, 2023
revanth and sanjay
Andhra

తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!

December 1, 2023
jagan pawan cbn
Trending

ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!

December 1, 2023
Trending

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

December 1, 2023
Telangana

తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

December 1, 2023
KCR
Trending

కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?

December 1, 2023
Load More
Next Post
Rohtak Chidi Villagers Gifted 2 Crore Rupees And A Car To Defeated Sarpanch Candidate Ann

ఓడిన సర్పంచ్ కి 2 కోట్ల కారు గిఫ్టుతో ఓదార్పా ? ఎందుకు?

Latest News

  • యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!
  • తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!
  • ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!
  • కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!
  • తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?
  • కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?
  • చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం
  • కేటీఆర్ ఫుల్ ఫ్రస్ట్రేషన్
  • ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
  • కేసీఆర్ సారూ..అలానే చేశారు!
  • కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

బాబు అక్రమ అరెస్టు..ఆత్మరక్షణలో బీజేపీ!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra