ఒంగోలులో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో ‘క్విట్ జగన్-సేవ్ ఏపీ’ పేరుతో రాజకీయ తీర్మానాన్ని పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 2024 ఎన్నికలకు ఇదే నినాదాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లాలని.. ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొని విజయం సాధించాలని.. వందేళ్లకు సరిపడా నాయకత్వా న్ని అందించేలా ప్రణాళికతో వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. తొలి రోజు మొత్తం 17 తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది.
రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి.. ప్రజల్ని బాధల్లోకి నెట్టిన విధానాన్ని వివరించాలని.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని యనమల అన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా మహానాడులో ‘క్విట్ జగన్-సేవ్ ఏపీ’ పేరుతో రాజకీయ తీర్మానాన్ని యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. 40 ఏళ్ల వేడుకతో మరోసారి పోరాటానికి కార్యోన్ముఖులం అవుదామన్నారు. రాజకీయ శక్తుల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
రాష్ట్రాన్ని సంక్షోభంలోకి.. ప్రజల్ని బాధల్లోకి నెట్టిన విధానాన్ని వివరించాలని… ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వందేళ్లకు సరిపడా నాయకత్వాన్ని అందించేలా ప్రణాళికతో వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని రామకృష్ణుడు అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వ్యూహాలతో వెళ్లాలని స్పష్టం చేశారు. పార్టీకి దూరమైన వారిని చేరువ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని.. పార్టీ మరింత బలోపేతానికి బలమైన వ్యూహాల అమలు చేయాలని పేర్కొన్నట్లు చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొని విజయం సాధించాలని.. వందేళ్లకు సరిపడా నాయకత్వాన్ని అందించేలా ప్రణాళికతో వెళ్లాలని యనమనల అన్నారు. తొలిరోజు టీడీపీ మహానాడు ముగిసింది.
నేడు బహిరంగ సభ
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు సమీపంలో భారీ బహిరంగసభ జరగనుంది. రెండురోజుల పాటు ఇక్కడ జరుగుతున్న టీడీపీ మహానాడు ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహిస్తుండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచే లక్ష మందికిపైగా ప్రజలు, టీడీపీ కార్యకర్తలు హాజరుకానున్నారు.
నగర సమీపంలోని మండవవారిపాలెం పొలాల్లో ఏర్పాటు చేసిన మహానాడు ప్రాంగణంలోనే ఈ సభను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ జరగనుండగా సాయంత్రం ఐదు గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నారు.
జై తెలుగుదేశం ????????#Mahanadu2022 pic.twitter.com/glDWb5UJSo
— iTDP Official (@iTDP_Official) May 27, 2022