టీడీపీని వైరల్ చేసిన జగన్ !


కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంటాయి. సరిగ్గా జగన్ తాజా నిర్ణయం అలాంటి ఫలితాన్నిచ్చింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ ఫైన్లు వేసేలా జగన్ చట్టం తీసుకువచ్చారు.

ఇలా చేస్తే "భరత్ అనే నేను" సినిమాలో మహేష్ ను పొగిడినట్టు జనం అంతా తనను పొగుడుతారు అనుకున్నారు. ఈ విషయం స్వయంగా ఏపీ మంత్రి, జగన్ వీర భక్తుడు, తనను తాను జగన్ పట్ల కుక్కలా విశ్వాసం ఉన్న వ్యక్తిని అని చెప్పుకున్న పేర్ని నాని ద్వారా బయటపడింది.

ఆయన ఇదే మాట అన్నారు. "భరత్ అనే నేను"లో ఫైన్లు వేస్తే చప్పట్లు కొట్టారు. అదే పని జగన్ చేస్తే తిడతారా? అంటూ నేరుగా అనేశారు.ఈ నేపథ్యంలో ఎవరు చేశారో తెలియదు గాని ఒక కామెంట్ బాగా వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ ని దున్నేస్తోంది. నిజానికి రెండు వైపుల పదునున్న కత్తిలా అటు సర్కారును ఇటు వైసీపీ పార్టీని రెండింటిని ఇరకాటంలో పడేసిందా కామెంట్.. అదేంటో మీరే చదవండి కింద.

బైక్ లకి మోటార్ వాహనాలకు వెస్తో న్న జరిమానా లు చూసి
ఏదేమైనా సైకిలే  గొప్ప అనుకుంటున్నారు అందరూ
Bicycle


పోలా అదిరిపోలా అంటున్నారు దీనిని చదివిన వాళ్లుజగన్ అనుయాయులకు పిచ్చెక్కుతోంది జగన్ నిర్ణయాలు చూసి కానీ ఎవరూ ఎదురుతిరగలేరు. చూద్దాం...  ఏం జరుగుతుందో  !

ఏదేమైనా ట్రాఫిక్ ఫైన్లపై జగన్ నిర్ణయం తెలుగుదేశం పార్టీ సింబల్ ని హైలైట్ చేసి బాబు గుర్తు అయిన సైకిల్ ఇమేజ్ ని అమాంతం పెంచింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.