న్యూజిలాండ్ తెలుగుదేశం విభాగం ప్రతి సంవత్సరం నందమూరి తారకరామారావు గారి జయంతి మరియు మహానాడు ఉత్సవాల్ని ఘనంగా జరుపుకొంటారు.
కరోనా మహమ్మారి విజృంభిన నేపథ్యంలో ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్ని నిరాడంబరంగాజరిపి నిధులు సమీకరణచేసి ఆ నిధులను కరోనా బాధితుల సహాయార్ధం ఎన్టీఆర్ ట్రుస్టుకి ఇవ్వాలని తెలుగుదేశం న్యూజిలాండ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ కృష్ణమనేని ,ఆదిశేషయ్య నల్లపనేని, సుబ్బారావు నడింపల్లి ,జితేంద్ర బాబు నిమ్మగడ్డ ,విజయ్ వీరపనేని,ప్రసాద్ ముత్తారెడ్డి మరియు శ్రీకాంత్ అన్నే తదితరులు నిర్ణయించారు.
దానికి మద్దతుగా మరో కమిటీ సభ్యుడు ప్రసాద్ ముత్తారెడ్డి గారు తనవంతుగా $2000 భూరి విరాళం ప్రకటించారు.ఇదే స్పూర్తితో $10000 సమీకరించాలని సభ్యులు ప్రతిజ్ఞ చేసారు. మే నెల ౩౦వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు vartual విధానంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా ప్రారంభిస్తారు.అదే రోజు సమీకరించిన నిధులను ఎన్టీఆర్ ట్రుస్టుకి బదలాయిస్తారు అని తెలుగుదేశం న్యూజిలాండ్ విభాగం ప్రకటించింది. రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో దేశ,రాష్ట్ర పరిస్థితులు మరియు covid సమస్యల గురించి చర్చించనున్నట్లు శ్రీనివాస్ కృష్ణమనేని తెలిపారు. విరాళాలు ఇచ్చినవారందరికి కృతఙ్ఞతలు తెలుపుతూ మరింతమంది దాతలు ముందుకు రావలసిందిగా న్యూజిలాండ్ తెలుగుదేశం పిలుపునిచ్చింది