ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో జగన్ అండ్ కో ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ.10వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ను అనుగొండ ప్రజలు కలిశారు. ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య ప్రాజెక్టు వద్ద వరదల సమయంలో గేట్లు ఎత్తకపోవడంతో 61మంది అమాయక ప్రజలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోనే ఇసుక మాఫియా రాష్ట్రవ్యాప్తంగా పేట్రేగిపోతోందన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అనుగొండ వాగు పూడిక తీత చేపట్టి ముంపుబారిన పడకుండా రక్షణ కల్పిస్తామన్నారు. కాగా, సీఎం జగన్ పై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ దళిత ద్రోహి అని దుయ్యబట్టారు. దళితులపై దమనకాండ జరుగుతోందని, దళితులను చంపడానికి స్పెషల్ లైసెన్స్ ఇచ్చారని ధ్వజమెత్తారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే విదేశీ విద్యా పథకం ప్రారంభిస్తామని, వైసీపీ నేతలు లాక్కున్న దళితుల భూములను తిరిగి ఇప్పిస్తామని ప్రకటించారు. దళితులకు భూమి కొని కేటాయిస్తామని నారా లోకేష్ ప్రకటించారు.
సమస్యల వెల్లువ
కర్నూలు జిల్లా కోడుమూరులో యువగళం పాదయాత్రను నిర్వహిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా లోకేష్‌ని కలిసేందుకు ప్రజలు బారులు తీరారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్దులను కలిసి నారా లోకేష్ సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. పన్నులు విపరీతంగా పెంచేశారని స్థానికులు లోకేష్ వద్ద వాపోయారు. స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నామని యువకులు తెలిపారు.
జగన్నాటకాలు చూసి 'అయ్యో' అని జాలిపడితే ఈ కథలో జడ్జిగారిలా షాక్ అవ్వాల్సి వస్తుంది. అందుకే ముసుగు చాటు విల'నిజం' తెలుసుకోండి. ఇంతకీ కథేంటి అంటారా? లోకేష్ గారు చెప్పిన జగన్నాథం కథ వినండి.#YuvaGalamLokesh#YuvaGalamPadayatra#ByeByeJaganIn2024#LokeshinKurnool pic.twitter.com/zOybIKpu22
— Telugu Desam Party (@JaiTDP) May 3, 2023