దాచేపల్లిలో టీడీపీ నేతను ఎంత దారుణంగా హత్య చేశారంటే?
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రెండు.. మూడు రోజుల క్రితమే కడప జిల్లా ప్రొద్దుటూరులో సుబ్బయ్య అనే టీడీపీ నేత దారుణ హత్య ఇంకా చెదిరిపోకముందే గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. పెదగార్లపాడు గ్రామానికి పదిహేనేళ్లు సర్పంచ్ గా వ్యవహరించిన పురంశెట్టి అంకుల్ ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
నిర్మాణం జరుగుతున్న అపార్ట్ మెంట్ లో టీడీపీ నేత గొంతు కోసి చంపేయటం రాజకీయ వివాదంగా మారింది. ఇటీవలే టీడీపీ నేత హత్య జరిగిన రోజుల వ్యవధిలోనే మరో హత్య చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఈ హత్య ఎవరు చేసి ఉంటారన్నది ప్రశ్నగా మారింది. ఈ హత్య వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నా.. అందుకు తగ్గ ఆధారాల్ని ఎవరూ చూపించలేకపోతున్నారు. వరుస పెట్టి జరుగుతున్న ఉదంతాలు ఇప్పుడు అందరూ ఏపీ వైపు చూడేలా చేస్తోంది.
ఓవైపు దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం.. ఇది సరిపోదన్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున టీడీపీ నేతలు హత్యలకు గురి కావటం అధికారపక్షాన్ని ఇరుకున పడేలా చేస్తోంది. హత్య గురించి సమాచారం అందుకున్నంతనే పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. తమ నేత హత్య వెనుక అధికారపక్ష నేతలే ఉన్నారంటూ తెలుగు తమ్ముళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హత్య సమాచారం తెలుసుకున్నంతనే మృతుడి కుటుంబ సభ్యులు దాచేపల్లి సెంటర్ కు చేరుకొని ఆందోళనకు దిగారు. వారి రోదనలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయింది. మొన్న ప్రొద్దుటూరు, ఇప్పుడు గురజాల వరుసగా టిడిపి నేతలను హత్య చేయించి ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నాడు. (1/4) pic.twitter.com/RIbmfTdNhM
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 3, 2021