భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఒక్క భారత్‌లోనే కాకుండా.. విదేశాల్లోని భారతీయులు సైతం ఘనంగా నిర్వహించుకున్నారు.
ముఖ్యంగా అమెరికాలోని ప్రవాసులు.. దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకొన్నారు.
బే ఏరియాలోని ఫెమాంట్లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 20వ తేదీన `ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్`(ఎఫ్‌ఓజీ) పేరుతో స్వతంత్ర భారత దేశ డైమండ్ జూబ్లీ వేడులను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో.. భారత్‌కు చెందిన పలు రాష్ట్రాల పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తొలుత.. ఆదివారం ఉదయం.. నగరంలోని పలు వీధుల్లో సంప్రదాయ పద్ధతిలో శకటాలను ఊరేగించారు.
స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించాయి.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) కూడా భాగస్వామ్యం వహించింది.
అదేవిధంగా బే ఏరియాలోని ఇతర తెలంగాణ ఆర్గనైజేన్లు కూడా పాలుపుంచుకున్నాయి.
ఈ క్రమంలో బెస్ట్ డిజైన్ అవార్డును తెలంగాణ ఫ్లోట్ సొంతం చేసుకుంది.
ఈ కార్యక్రమంలో మొత్తం 5 వేల మంది ప్రజలు పాల్గొన్నారు.
ఈ వేడుకల్లో తెలంగాణ నుంచి మణికొండ శ్రీనివాస్, హరి గక్కాని, సంతోష్ అడగుళ్ల, శ్రీనాథ్, వేణు, ప్రదీప్, మహేందర్, ప్రేమ్ సహా అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొని.. కార్యక్రమాలను విజయవంతం చేశారు.
ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం పలు స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు తమ తమ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నగరంలోని వీధుల్లో శకటాలను ఊరేగించారు.
కాగా, ఈ కార్యక్రమం నిర్వహించిన `ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్`(ఎఫ్ ఓజీ) నిర్వాహకులు డాక్టర్ జాప్రా, కేపీ, విద్య, సాంస్కృతి విభాగం చైర్మన్ జోత్స్న, కేపీలకు అభినందనలు తెలిపారు.