గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న పోరాడి కన్నుమూశారు. తారకరత్న మృతదేహాన్ని ఈ ఉదయం మోకిల లోని తన నివాసానికి తరలించారు. మిత్రులు, అభిమానులు సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. రేపు అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
https://twitter.com/RathnaveluDop/status/1627113886389501953
తారక రత్న జీవితంలో ముఖ్యమైన విషయాలు
- 1983 ఫిబ్రవరి 22 (40) జన్మించిన తారక రత్న
- నందమూరి వారసుడు గా 2002 లో హీరో గా తారక రత్న ఎంట్రీ
- ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభించి గిన్నిస్ రికార్డ్ కెక్కిన తారక రత్న
- ఒకే రోజు 9 సినిమా ల ప్రారంభం ప్రపంచం లో మారే హీరో కి లేని అరుదైన రికార్డ్
- హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 23 చిత్రాల్లో నటించిన తారకరత్న
- షూటింగ్ దశలో వున్న మరో రెండు చిత్రాలు
- రిలీజ్ కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్
- లాస్ట్ ఇయర్ 9 hours అనే వెబ్ సిరీస్ లో నటించిన తారక రత్న
- ఫ్యాషన్ డిజైనర్ ఆలేఖ్య రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్న తారక రత్న
- కూతురు పేరు నిష్క
- ఒకటో నెంబర్ కుర్రాడు, యువ రత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, భక్త సిరియలు, సారధి చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన తారక రత్న
- 2009 లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్న తారక రత్న
we will miss you anna
RIP????#TarakaRatna pic.twitter.com/CEI9wcMwYk— Paritala Sreeram (@IParitalaSriram) February 18, 2023