• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బే ఏరియా లో తారక రాముని 102వ జయంతి!

admin by admin
May 27, 2025
in Around The World, NRI, Trending
0
0
SHARES
42
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమెరికా – కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియా లో తారక రాముని 102వ జయంతి మరియు మినీ మహానాడు సందడి తారక రాముని 102వ జయంతి మరియు మినీ మహానాడు సందడి

అమెరికాలోని బే ఏరియా లో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సంబరాలు ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి పర్యవేక్షణలో టీడీపీ నాయకులు వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో అత్యంత ఘ‌నంగా జరిగాయి. మిల్పిటాస్ నగరంలోని స్టార్ లైట్ పార్క్ ఇందుకు వేదిక అయ్యింది.

తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న మహానాడు కార్యక్రమం కావడంతో 150 మందికి పైగా అభిమానులు, మహిళలు, చిన్నారులు ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్నారు.

ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి హాజరైన తెలుగుదేశం అభిమానులని ఉద్దేశించి ఆడియో కాల్ ద్వారా మాట్లాడుతూ.. తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం ప‌రిత‌పించిన స‌ముజ్వల దీప్తి నంద‌మూరి తార‌క‌రామారావు గారు చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. 40 అమెరికా నగరాల్లో సంవత్సరం పాటు తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరిపామని.. ఇప్పుడు 102వ జయంతి మాత్రమే కాకుండా ఆ మహనీయుని సినీ రంగ ప్రవేశం జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భం కూడా కావడం హర్షణీయమని, ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాభినందనలు తెలిపారు.

ప్రముఖ దర్శకులు, సినీ నటులు కాశీవిశ్వనాధ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సినీ రంగానికి తలమానికమైన తారక రామారావు గారు మనిషి రూపంలో జ‌న్మించిన పుణ్య పురుషులని, ఆయన 102వ జయంతి వేడుకలలో పాలుపంచుకునే అవకాశం దొరకడం తన అదృష్టం అన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత అభివృద్ది సాధిస్తుందని ఆకాంక్షించారు.

కోగంటి వెంకట్ మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మగౌర‌వాన్ని ద‌శ దిశలా చాటిన రామారావు గారి జయంతి కార్యక్రమాలు జరిపే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలందరికీ మహానాడు సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా మరింత అంకితమౌతుందని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, గాంధి పాపినేని, లియోన్ బోయపాటి , విజయ్ సాగర్ రెడ్డి సమన్వయపరచగా, భరత్ ముప్పిరాల, సీతారాం కొడాలి, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, బ్రహ్మానంద నాయుడు దబ్బర, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, రవికిరణ్ ఆలేటి, కోన నరేంద్రనాధ్ రెడ్డి, తిరుపతిరావు, శ్రీనివాస్ ఆత్మకూరి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రాఘవయ్య, రాజా కొల్లి, హర్ష యడ్లపాటి, అనిల్ సాపినేని, చంద్రశేఖర్, రాంబాబు మానుకొండ, మోహన్, లోకేష్, యెంవీ రావు, గాంధి ప్రసాద్, సుబ్బారావు, కృష్ణ నరుకుళ్ళ, మునిరెడ్డి, నవీన్ కొడాలి తదితరులు పాల్గొన్నారు.

చేతన జాగర్లముడి, సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, రూప గుర్రం, విలేఖ్య వెనిగళ్ళ, రుద్రాణి తాతినేని, మాధురి వెన్నపూస, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి దబ్బర, శిరియాలు నెల్లూరి తదితర మహిళ మణులు హజరవ్వడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

బే ఏరియాలోని ప్రముఖ రెస్టారెంట్లు బిర్యానీ జంక్షన్, నాన్స్ & కర్రీస్ , బిర్యానీస్ (మిల్పిటాస్), విజేత స్వగృహ ఫుడ్స్, ఆర్. ఆర్. ఆర్. బిర్యానీస్ (ఫ్రీమోంట్), ఆర్.ఆర్.ఆర్. బిర్యానీస్ (మౌంటైన్ వ్యూ) హాజరైన వారందరికీ పసందైన భోజనం సమకూర్చారు.

Tags: Taraka Rama's 102nd Birth Anniversary in the Bay Area
Previous Post

కడప జిల్లా పేరు మార్పు.. కానీ, జ‌గ‌న్‌లాగా చేయ‌లేదు!

Next Post

క‌డ‌ప `మ‌హానాడు`.. మెనూ చూస్తే నోరూరాల్సిందే..!

Related Posts

Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Around The World

ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!

June 22, 2025
Around The World

ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Load More
Next Post

క‌డ‌ప `మ‌హానాడు`.. మెనూ చూస్తే నోరూరాల్సిందే..!

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra