టాంటెక్స్ వారు,యూట్యూబులో వర్చ్యువల్‌గా సంక్రాంతి సంబరాలు వినూత్నంగా నిర్వహించారు.సంస్థఅధ్యక్షురాలుశ్రీమతిలక్ష్మిఅన్నపూర్ణ పాలేటి గారు మరియు కార్యక్రమ సమన్వయకర్త సరిత ఈదరగారి అధ్వర్యంలో ఈ కార్యక్రమాలని నిర్వహించారు.
సంస్థ 2020 సం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరుగారు ప్రసంగిస్తూ ఎన్నో స్వచంద సేవాకార్యక్రామాలు జూమ్ద్వారాసాంకేతిక శిక్షణలు ఈకరోనా సమయములో చేయటము జరిగినట్లు తెలిపారు మరియు కరోనావిరాళాలను మూడు భాగములుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మరియు డల్లాస్టెక్సాస్రాష్ట్రానికి ఇవ్వడము జరిగింది అని తేలియచేసారు. అంతే కాక 2021 పాలకమండలికి తనవంతు సహాయము ఎప్పుడు వుంటుందిఅని తెలిపారు. కృష్ణారెడ్డికోడూరు గారు సంస్థ నూతన అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారిని పరిచయం చేశారు.
2021 అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి గారు ప్రసంగిస్తూ తమకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులందరి కికృతఙ్ఞతలు తెలియచేసారు. డల్లాస్‌లోని తెలుగు వారికోసం ప్రస్తుతం చేస్తున్నసేవ కార్యక్రమాలే కాకుండా, మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియచేశారు. టాంటెక్స్నూ తన కార్యవర్గసభ్యులను ఒక పాట రూపంగా అందరికీ పరిచయం చేశారు ఉమామహేష్పార్నపల్లి ఉత్తరాధ్యక్షుడుగా, శరత్‌రెడ్డి ఎర్రం ఉపాధ్యక్షులుగా, కళ్యాణి తాడిమేటి కార్యదర్శిగా, శ్రీకాంత్‌రెడ్డి జొన్నల సహాయకార్యదర్శిగా, చంద్రశేఖర్‌రెడ్డి పొట్టిపాటి కోశాధికారిగా, స్రవంతి ఎర్రమనేని సహాయకోశాధికారిగా పరిచయంచేశారు. పాలకమండలి అధిపతి డాక్టర్పవన్పామదుర్తిగారు, 2020 పాలకమండలి అధిపతి పవన్నెల్లుట్ల గారు ప్రసంగిస్తూ, అందరికీ 2021 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.
అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మిఅన్నపూర్ణ పాలేటిగారు తనప్రసంగములో ఈసంక్రాంతికి మీకునచ్చిన మీరుమెచ్చిన కార్యక్రామాలను మీ ముందుకు ఈరూపేన తీసుకువచ్చారు, జానపద కళలకుపెట్టింది పేరు మన రెండు తెలుగురాష్ట్రాలు. కాలక్రమేణా అలాంటి కళలు సరైన పోషకులు లేక అంతరించి పోతున్నాయి, అందువలన కళలను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను మనము గుర్తుపెట్టు కోవలసిన సమయము ఆసన్నమయింది. ఒకప్పుడు గ్రామీణులకు వినోదం, వికాసం అందించడంలోప్రసిద్ధిగాంచిన బుర్ర కధలు, హరిదాసులు, గంగిరెద్దు మేళములు, జానపద పేరడీలు మొదలయిన కళలు మరుగున పడిపోకుండా కాపాడుకొంటూ వస్తున్న కళాకారులను ఇక పై మీముందుకుతీసుకురావడంజరుగుతుంది. కళలను పోషిస్తూ కూడా దుర్భరమైన జీవనము గడుపుతున్న అలాంటిక ళాకారుల కుటుంబాలను గుర్తించి మన టాంటెక్స్ సంస్థ ద్వారా వెలుగులోనికి తెచ్చితగినంత సహాయము చేసి భావితరాలకు మన జానపద కళలను సజీవంగా అందించాలనేదే మా ప్రయత్నం. ఈ కార్యక్రమ ప్రదర్శనలకు విరాళాలిచ్చి ఆర్ధిక సహాయ సహకారాలందిస్తున్న పోషక దాతలకు మన సంస్థ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసారు..
తదుపరి తెలుగు వెలుగు సంపాదకులు శ్రీమతి స్రవంతి సంక్రాంతి సంచికను వర్త్యవల్గా అవిష్కరింపచేశారు మరియు తాను 2020 లో సాంస్కృతిక కార్యక్రమాలనికో విడ్మూలముగ చేయ లేక పోయామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సమీరా ఇల్లెందుల గారు తమ వ్యాఖ్యానంలో సంక్రాంతి పండగ విశేషాలైన భోగి మంటలు, గొబ్బమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాలువివరించారు.
హరిదాసు (ప్రశాంత్ కుమార్) శ్రీ మద్రమారమణ గోవిందోహరి అంటూ సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గంగిరెద్దు మేళం, డాక్టర్అరుణ సుబ్బారావు గారి బృందముతో తోలు బొమ్మలాట, పేరడీ జానపదగే యాలు, శ్రీమతి హేమాంబుజ కట్టాగారి వీణామృతం, నాని బృందం కోలాటం, సినీగాయని శ్రీమతి ఉషాగారి గానములు, లాస్య సుదా అకాడమీ నుంచి కీర్తన, నర్తన కలవగుంట సోదరీమణుల నృత్య ప్రదర్సనలు మరియు రాగలీనా అకాడమీ నుంచి శ్రీమతిస్వప్న గుడిమెళ్ళగారి శిష్యుల శాస్త్రీయ జానపద నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి.
కోత్తగా భాధ్యతలు శ్వీకరించిన సాంస్కృతిక కార్యదర్శి శ్రీసు రేష్పఠానేని ఎంతో నేర్పుగా సమయస్పుర్తితో సాంస్కృతిక కార్యక్రమాలను ముందుకు నడిపించారు.
కార్యక్రమ సమన్వయ కర్త సరిత ఈదరగారు, పోషక దాతల గురంచి పేరు పేరునా అభివందనములు మరియు కృతఙ్ఞతలు తెలియచేసారు.