‘తానా‘ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర‘ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్‘ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది. ఈ సారి ఇదంతా ‘తానా‘ లో శాశ్వత మార్పులకు, మరింత మంచి భవిష్యత్తుకు, మంచి అవకాశంగా భావిస్తున్నారు. సాధారణంగా 90 శాతం పైగా పదవులకు నామకే వాస్తే తంతుగా సాగిపోయే ఎన్నికలు ‘శ్రీనివాస గోగినేని‘ అనే సీనియర్ నాయకుడు, గతంలోనే పోటీచేసి మలి ప్రయత్నంగా ‘తానా‘ అధ్యక్ష పదవికై మళ్ళీ పోటీ చేయవచ్చు అనే విషయంగా మొదలైన చర్చలు, అనేకమంది ఆశావాహుల్లో, నిర్లక్ష్యానికి గురై నిరుత్సాహంలో ఉన్న వారిలో, సరికొత్త ఆశలు చిగురింప చేసి, కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.
చాలా కాలంగా కొద్దిమంది మధ్యే చిక్కుకున్న నాయకత్వ అవకాశాలు తిరిగి అందరికి అందుబాటులోకి రావొచ్చని, కొత్త మరియు పాత కలయికతో అందరినీ కలుపుకు పోతూ సంస్థ ఆశయాలకు, తెలుగు ప్రజల అవసరాలకు అనుగుణంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని, ఇప్పటికే వివిధ కార్యవర్గాలలో ఉన్నమంచి నాయకులతో పాటు, తాము కూడా పనిచేస్తూ భాగస్వాములు కావడానికి మంచి అవకాశం ఉంటుందని అనేకమంది భావిస్తున్నారు.అదే విధంగా తమ ‘గాడ్ ఫాదర్‘ లను సంతృప్తిపరిస్తే చాలు తమ బెర్తు ఖాయం అనుకుంటున్న కొద్దిమందిలో, కొత్తగా వచ్చే పోటీ లో ఏమై పోతామో అన్న ఆందోళన మొదలైంది.
ఉదాహరణకు ‘తానా‘ లో ‘అప్పలాచియాన్ రీజియన్‘ గా పిలవబడే ‘సౌత్‘ మరియు ‘నార్త్ కరోలినా‘ రాష్ట్రల్లోని పరిస్థితిని పరిశీలిస్తే క్రింది విషయాలు తెలుస్తున్నాయి. ‘తానా‘ 40+ సంవత్సరాల చరిత్రలో, గత 5 సంవత్సరాలుగానే ‘తానా‘ కార్యక్రమాలు చైతన్యవంతంగా జరుగుతున్నాయి. దాంతో పాటు గత ఎన్నికల సమయాల్లో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరగటమే కాకుండా వివిధ పదవులకై ఆశావాహులు కూడా పెరిగారు. ఈ రీజియన్ కు వచ్చే పదవుల సంఖ్య పరిమితం, కాని ఆశావాహులు అధికం కావటంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి.అలాగే రీజియన్ ముఖ్య కేంద్రాలైన ‘షార్లెట్, రాలీ, సౌత్‘ పట్టణాల మధ్య కూడా సమతూకం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటి పదవుల్లో ఉన్న‘ఠాగోర్ మల్లినేని‘, ‘సురేష్ కాకర్ల‘, ‘మల్లి వేమన‘, ‘చందు గొర్రెపాటి‘ తో పాటు గతం లో అవకాశాలు దక్కించుకోలేక పోయిన ‘నాగా పంచుమర్తి‘, ‘కుమార్ నెప్పల్లి‘ మాత్రమే గాకుండా లోకల్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులైన ‘రమణ అన్నే‘, ఇంకా ‘పట్టాభి కంఠంనేని‘, ‘దిలీప్ తోటకూరి‘, ‘సురేష్ చలసాని‘, ‘శివ పులిపర్తి‘ తదితరులు ఛాన్సు కోసం రెడీగా ఉన్నట్లు వినికిడి. అంతేగాక సీనియర్లు, ముఖ్యులు అయినా శ్రీమతి ‘రూపా రాజు‘ గారు, ‘సుధాకర్ కొర్రపాటి‘ వంటి మరికొద్ది మంది పరిస్థితులని బట్టి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని తీవ్ర ప్రభావం చూపగల ప్రతిభావంతులే. ఇంకా పలువురి దృష్టి లోకి రాని మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేయవచ్చని వినికిడి. ఇప్పటికే గరం గరంగా ఉన్న చర్చలు ఏ రూపం తీసుకుంటాయో గమనిద్దాం.
అయితే సాధారణ సంఖ్యలో సభ్యులు, మరీ పెద్ద స్థాయి నాయకులైన వారు లేని ‘ఆప్పలాచియాన్ రీజియన్‘ లోనే ఇన్ని చర్చలు, ఆశావాహులు ఉంటె అత్యధిక సభ్యులు, అనేక మంది నాయకులు, ఎన్నో ‘తానా‘ కార్యక్రమాలు ఉన్నముఖ్య కేంద్రాల్లో ఎటువంటి చర్చలు, పరిణామాలు జరుగుతున్నాయో తేలిగ్గా ఊహించవచ్చు.అలాగే మరిన్ని ‘రీజియన్‘ ల గురించిన వివరాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అధినాయకులుగా చెలామణి అవుతున్న వారు ఆల్రెడీ ఎదో ఒక పదివిలో ఉన్నవారినే అటూ ఇటూ జరిపి అంతా మా ఘనతే అని చెప్పుకుంటున్నారా లేక ఈ సారి కూడా పోటీలను తప్పించి తమ మాట ఇంకా చెల్లుతుందని తెలియజేస్తారా అనేది రాబోయే కొద్ధి కాలం లోనే తెలుస్తుంది