రోడ్డు ప్రయాణాల్లో ద్విచక్రవాహనాల్లో ప్రయాణించేవారి భద్రత కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కర్నూలు రాజవిహార్ సెంటర్ లో అవగాహనా సదస్సు నిర్వహించారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ కే.వి. మహేష్, ట్రాఫిక్ డిఎస్పీ మహబూబ్ బాషా చేతులమీదుగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం డీఎస్పీ మహేష్ మాట్లాడుతూప్రజాశ్రేయస్సు కోరి ఉత్తర అమెరికా తెలుగు సంఘం – తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. హెల్మెట్లు ధరించడం వలన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో మరణాలను చాలావరకు తగ్గించగలమని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, కార్యదర్శి పొట్లూరి రవి, కమిటీ చైర్ రామ్ చౌదరి, తానా సభ్యులకు డీఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ ఈ కార్యకమానికి సహకరించిన పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, మీనాక్షి, సందడి మధు తదితరులు పాల్గొన్నారు.