ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) కేర్స్ థాంక్స్ గివింగ్ ఫుడ్ డ్రైవ్స్ లో భాగంగా నవంబర్ 24 నాడు మిడ్ అట్లాంటిక్ ‘తానా’ విభాగం ఆధ్వర్యంలో దాదాపు రెండువేల పౌండ్ల ఆహారపదార్థాలను పెన్సిల్వేనియా లోని చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంకుకి అందించారు.
ఈ కార్యక్రమంలో ‘తానా’ కార్యదర్శి’రవి పొట్లూరి’, పాఠశాల చైర్ నాగరాజు నలజుల, కమిటీ సభ్యులు ఫణి కంతేటి, సునీల్ కోగంటి, సరోజ పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, చలం పావులూరి తదితరులు పాల్గొన్నారు. స్ప్రూస్ ఇన్ఫోటెక్ వేణు సంగాని ఈ కార్యక్రమానికి సహకరించారు. ‘తానా ‘అధ్యక్షుడు జై తాళ్ళూరి ఆధ్వర్యంలో కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ మల్లి వేమన, కేర్స్ చైర్ జో పెద్దిబోయిన పర్యవేక్షణలో జరుగుతున్న థాంక్స్ గివింగ్ ఫుడ్ డ్రైవ్స్ లో భాగంగా మిడ్ అట్లాంటిక్ ప్రాంతంలో పది నగరాల్లో పదివేల పౌండ్లకు పైగా ఆహార పదార్థాలు అందిస్తున్నామని ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న బోర్డు చైర్మన్ హరీష్ కోయ, ఫౌండేషన్ కార్యదర్శి రవి మందలపు, రీజినల్ కోఆర్డినేటర్ సతీష్ చుండ్రు మరియు దాతలందరికి ధన్యవాదాలు తెలియజేసారు.