• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ ఎన్నికల కోలాహలం

admin by admin
March 22, 2021
in TANA Elections
0
0
SHARES
57
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చీలిక దిశగా రెండు వర్గాలు ప్రచార ఉధృతి

తెలుగు సమాజ ఐక్యత దిశగా ‘గోగినేని’

‘తానా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చిన సందర్భంగా ఎన్నికల సంగ్రామం ఏ విధముగా ఉండబోతుందో క్రమక్రమంగా స్పష్టమవుతోంది. గత వారాంతంలో జరిగిన బోర్డు మీటింగ్ రికార్డు స్థాయిలో 9 గంటల పాటు జరిగి, మరింత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కువమంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన ‘భక్త బల్లా’, ‘హేమచంద్ర కానూరి’ మరియు ‘సుమన్ రామిశెట్టి’ ల నామినేషన్లను బోర్డు కూడా తిరస్కరించినట్లు, ముగ్గురూ ఇంతకు ముందు నుంచి ‘తానా’ కు వివిధ పదవుల్లో పనిచేసి ఉన్న కారణంగానూ, తిరస్కరణకు గురైన విధానంలో కొన్ని వెసులుబాట్లు కారణంగానూ, బోర్డు ఆమోదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఫక్తు రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కువమంది భావించడం ‘తానా’ వంటి స్వచ్చంద సంస్థకు మేలు కాదని చెప్తున్నారు. అలాగే ‘బినామీ అడ్రస్ ప్రూఫ్’ లతో వివాదాస్పదమైన ‘4000 అడ్రస్ మార్పుల’ పై కూడా ‘న్యూట్రల్ థర్డ్ పార్టీ కమిటీ ‘కాకుండా ఇంటర్నల్ బోర్డు సభ్యులు మరియు వారి అనుచరులతో వ్యవహారం నడుపుతుండడం కూడా వివాదాస్పదంగానే ఉంది. ఈ పనికి మరికొంత సమయం పట్టే కారణంగా బాలట్లు పంపే సమయము మరి కొద్దిరోజులు ఆలస్యంకావచ్చునని తెలుస్తోంది. ఇక రెండు మూడు రాష్ట్రాల మినహా అన్నిచోట్లా స్థానిక ప్రతినిధుల ఎన్నికలు ఏకగ్రీవం కావటం ‘తానా’ తెలుగు సమాజానికి కొంత  ఊరటనిచ్చింది.

ఇక రెండువర్గాలుగా చీలి పోటీ పడుతున్న వారు తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ అన్ని రాష్ట్రాలలో మద్దతుదారులను ఉత్సాహపరచుకొంటూ రెండో వర్గం పై నిఘా పెడుతున్నారు. ‘కొడాలి’ మరియు ‘శృంగవరపు’ వర్గాలు రెండూ కోవిడ్ విషయాన్ని కూడా లెక్క చేయకుండా అనేక నగరాలూ తిరుగుతూ పర్యటనలు ఖరారు చేసుకోవటం వారిద్దరికీ ఉన్న అభద్రతా భావాన్ని, అలాగే పోటీ వాతావరణాన్ని తెలియచేస్తోంది. స్వచ్చంద సంస్థల్లో సాధారణంగా పాటించే నియమాలకు విరుద్ధంగా ప్రస్తుత అధక్షుడు ‘జయ్ తాళ్లూరి’, అందరి మద్దతు సహాయ సహకారాలతో పోటీ లేకుండా పదవి పొందిన తదుపరి అధ్యక్షుడు ‘అంజయ్య లావు ‘బహిరంగంగా ఒక వర్గానికి వత్తాసు పలకటంపై అమెరికా వ్యాప్తంగా నిరసన వ్యక్తమైనప్పటికీ, తిరిగి అదే పని ఇంకా బహిరంగంగా చేస్తూ ఎన్నికల ప్రచారానికి వివిధ రాష్ట్రాలకు పర్యటన ఏర్పాట్లు చేసుకోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యం గా వారి స్వంత ప్రదేశాలైన అట్లాంటా, న్యూ యార్క్, న్యూ జెర్సీ లోనే కాక ,వారు వెళ్లే ప్రదేశాల్లోకూడా సభ్యులు వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ఇది చివరికి ప్యానెల్ కు వ్యతిరేక పవనంగా మారే ప్రమాదం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నానికి ముఖ్య కారణము గా తాము సమర్ధించే  ప్యానెల్ మొత్తం లో ప్రముఖమైన లేదా లీడ్ చేయగల ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం పెద్దలోపమని దానిని పూడ్చటానికి ఇంతకంటే వేరే మార్గం లేదని భావిస్తున్నప్పటికీ, ఇది కూడా వివాదాస్పదమై ఎదురు తిరుగుతుందేమోనని తర్జన భర్జన పడ్తున్నారు.

కొద్ధి నెలల క్రితం వరకు కలసి ఉండి అకస్మాత్తుగా రెండు వర్గాలుగా చీలి పూర్తి పానెల్స్ గా ఏర్పడి తెలుగు సమాజాన్ని రెండు వర్గాలుగా దీర్ఘకాలంపాటు చీల్చే విధంగా ప్రచారాలు జరుపుకోవడం పై చాలా మంది నిరసన వ్యక్త పరుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో , వివిధ వర్గాల పరిస్థితి ఏ విధంగా గోచరిస్తుందంటే–

శ్రీనివాస గోగినేని: వివాద రహితుడు, వర్గాలకు అతీతుడై గతం లో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ తో పాటు, కాన్ఫరెన్స్ సెక్రటరీ, దీర్ఘ కాలం బోర్డు మెంబరు తో పాటు అమెరికాలోని అనేక నగరాల్లో  ‘మన ఊరికోసం’ నినాదం తో చేసిన ‘5కే వాక్/రన్’ లకారణం గానూ, గతంలోనే ఒకసారి అధ్యక్షపదవికి పోటీ చేసిన కారణంగానూ ఉన్న గుర్తింపు తోడై ,ప్రస్తుతం పోటీ లో ఉన్న వారందరిలోకీ ఉన్నతుడుగానూ, ప్రముఖుడు గానూ మరియు అర్హుడు గానూ ‘తానా’ సభ్యులధికులు భావిస్తుండడం బాగా కలసివచ్చింది. దానికి తోడు అన్నిరాష్ట్రాల్లో తనకున్న అభిమానులు, మద్దతు దారులను తనదైన పద్దతిలో సమన్వయపరచుకొంటూ, సామాజిక,పేపర్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన అభిప్రాయాలకు, విధానాలకు ప్రాచుర్యం కలిపించుకొంటూ వర్గపోరాటాన్ని బహింరంగంగా ఖండించగలిగే ధైర్యం, నిబద్దత మూలంగా ‘తానా ‘సాధారణ సభ్యులకు హాట్ ఫేవరెట్ గా మారారు. తనకు ఎందుకు ఓటు వేయాలో చెపుతూ, మిగతా పదవులకు పోటీ చేస్తున్న వారిలో అత్యధికమంది తో సన్నిహిత సంబందాల వలన ఏ విధంగా ‘తానా’ లో ఐక్యత రాబట్టగలనో  స్పష్టంగా చెప్పుకుంటుండవలననూ,  ఆయనకు ఎందుకు ఓటు వేయకూడదు అనేది ప్రత్యర్థులు చెప్పలేకపోవడం వలన ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి అందరిలోకీ ముందు ఉన్నట్టే లెక్క

Dr.నరేన్ కొడాలి: తన ప్యానెల్ ముఖ్య సభ్యులైన ‘భక్త బల్లా’,’హేమా కానూరి’ ల నామినేషన్లను కూడా సమన్వయంతో సరిగ్గా వేయుంచుకోలేని పరిస్థితిలో, ఫక్తు రాజకీయాకారణాలతో బోర్డ్ వీరి నామినేషన్లను తిరస్కరించినప్పటికీ ,ఎటువంటి ప్రతిఘటనను గాని, ప్రత్యర్థి వర్గం ‘అడ్రస్ మార్పు’ వ్యవహారం లో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఎదుర్కునే పటిమ ఇప్పటివరకూ చూపించకపోవడంపై, అయన వర్గంలోనే  అయన నాయకత్వముపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరుగుతోందో అర్ధంకాక తన ప్యానెల్ సభ్యులు కొంత నీరసంగానే ఉన్నట్లు, తాము నమ్ముకున్న నాయకత్రయం బాహు బలులా లేక బాహు బలహీనులా తేల్చుకోలేక సతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థాగతంగా సాంప్రదాయకమైన ఓటు బ్యాంకు కొంతవరకు అన్నిచోట్లా ఉండడటం, అలాగే ప్రత్యర్థి వర్గానికి అటువంటి వెసులుబాటు లేక తాము చేర్పించుకొన్న వోట్లపైనే ఆధారపడటం కొంతవరకు వెసులుబాటు కాగా, ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే, అవకాశాలున్నట్లే భావిస్తున్నారు.అలాగే ముఖాముఖీ పోటీ గాక అధఃక్ష స్థానానికి త్రిముఖ పోటీ ఉండడటం, నరేన్ కు ప్రత్యక్ష కార్యక్రమ నిర్వహణాలలో అంతగా ప్రజా సంబంధాలు లేకపోవడం మూలం గా వెనకబడే ప్రమాదం ఉందనుకుంటన్నారు.

నిరంజన్ శృంగవరపు: ప్రస్తుత కార్యవర్గాలలో మద్దతుఉండటం నైతికంగా బలంగా అనిపిస్తున్నప్పటికీ  వయసు, అనుభవము, గుర్తింపు రీత్యా ‘నిరంజన్’ మిగతా ఇద్దరిలో వెనుక బడి ఉండటంతో బాటు ఇదే కారణాలలో ‘శ్రీనివాస గోగినేని ‘మిగతా ఇద్దరికంటే ముందు ఉండటం  ఇబ్బందికరంగా ఉంది. పైగా బాహుబలుల ప్యానెల్ పై ఉన్న వ్యతిరేకతను  తమవైపు లాగుతానికి ప్రయత్నించినా, గత చరిత్ర లో వీరందరూ కలసి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నప్పటి నించీ పోరాడున్న ‘గోగినేని’ కే వ్యతిరేకఓటు పడే పరిస్థితి లో ఎలా వ్యవహరించాలో తెలియక తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షులు బహిరంగ మద్దతు పైకి బలంగా అనిపిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఎంత ఉపయోగపడుతుందో నని  లెక్కలు వేసుకుంటూ ఊరట పడ్తున్నట్లున్నారు. వెరసి ప్రెసిడెంట్ అభ్యర్థికి  కొంత ఆందోళనకర పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్థున్నప్పటికీ, మిగతా ప్యానెల్ గట్టెక్కవచ్చని కంఫర్ట్ ఫీలవుతున్నారు కానీ తుది ఫలితం తమకు బలంగా భావిస్తున్న బాలెట్స్ కలెక్షన్స్ మీదే ఆధారపడి ఉండటం కొంత ఆందోళనకారమే.

నిజానికి ‘గోగినేని’ స్వచ్చంద ఓట్లపై నమ్మకం పెట్టుకోగా, రెండు వర్గాలు బాలట్ కలెక్షన్ల ప్రక్రియపై మల్లగుల్లాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితిని కోవిద్ సమయంలో గమనిస్తున్న మనలాంటి వాళ్ళు పాడుకొనే పాట–

“అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా! నీ గుట్టు ఏమిటో తెలిసిందిలే, నీ బెట్టు దిగజారి పోతుందిలే! అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా!”

‘తానా’ ఎన్నికల నామినేషన్ల పర్వం-సర్వం గందరగోళం-ముఖ్య నాయకుల నిట్టనిలువు చీలికతో మరింత సంక్లిష్టం
రోజులు గడిచే కొద్దీ ‘తానా’ ఎన్నికలలో చాల మంది ఊహిస్తున్నట్టుగానే రసవత్తర పరిణామాలు జరుగుతూ, తరవాతేమిటో అనే ఉత్సుకుతను కలిగిస్తోంది.
GhostNamasteAndhra

 

బ్రేకింగ్ న్యూస్-‘తానా’ లో అడ్రస్ మార్పుల అక్రమాల బట్ట బయలు
అత్యున్నత సంస్థను బ్రష్టు పట్టిస్తున్న వారిని ఈసడించుకుంటున్న తెలుగు ప్రజలుఅందరూ అనుకుంటున్నంతా అయ్యింది. సంస్థను గుప్పిట్లో పెట్టుకుంటానికి వీలైనన్ని విధాల్లో ఎలెక్షన్లో రిగ్గింగ్ చేసి ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా చేస్తున్న అక్రమాలు కొన్ని బట్టబయలయ్యాయి.
GhostNamasteAndhra

 

‘తానా’ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం-ముమ్మరంగా ఏకగ్రీవ ప్రయత్నాల కొనసాగింపు
‘తానా’ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 13 కల్లా నామినేషన్లు ఎలక్షన్ కమిషన్ వద్దకు చేరవలసిన కారణంగా అభ్యర్థులు బిజీబిజీగా ఆ ఏర్పాట్లలో ఉన్నారు.
GhostNamasteAndhra

 

‘తానా‘ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న‘గోగినేని’-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో?
‘తానా‘ఎన్నికల చిక్కుముడులు -కీలకం కాబోతున్న‘గోగినేని’-సుడులు తిరుగుతున్న రాజకీయం ఎటుపోతుందో ??
GhostNamasteAndhra

 

‘తానా’ టీం స్క్వేర్-ఆపదలో ఆపన్న హస్తం-అమెరికా తెలుగువాళ్ళకు ’911′ వ్యవస్థలాంటిది
‘తానా’ ఎన్నికల కోలాహలం రోజు రోజుకీ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అసలు ‘తానా’ ఎందుకు,శుద్ధ దండుగ,ఈ మధ్య వింటున్నదంతా ఏమీ సంతోషకరంగా లేదనే వారు ‘తానా ’తెలుగు వారికీ ,తెలుగు భాషకూ,తెలుగు సంస్కృతికీ ఎంత చేసిందీ,ఇంకా ఎంత చేయగలుగుతుందీ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
SanjayNamasteAndhra

 

‘తానా’ఎన్నికలు-చదరంగపు ఎత్తులా? వైకుంఠపాళి జిత్తులా??
ఈ రోజు జరుగుతున్న‘తానా’ బోర్డు మీటింగ్ తర్వాత ‘తానా’ఎన్నికల షెడ్యూల్ రానున్నందున ఎన్నికల రణానికి సిద్ధమవటం లో భాగంగా అనేక పరిణామాలు చకచకా సాగుతున్నాయి.
GhostNamasteAndhra

 

బ్రేకింగ్ న్యూస్-‘తానా‘ఎన్నికల గందరగోళం-‘రవి పొట్లూరి’కూడా ప్రెసిడెంట్ అభ్యర్థి గా బరిలోకి..
మహాభారత యుద్ధాన్ని మించి ట్విస్టులతో సాగుతున్న ‘తానా‘ఎన్నికల సమరభేరి ‘రవి పొట్లూరి’ కూడ ప్రెసిసెంట్ అభ్యర్థి గా పోటీ చేస్తానని ఆకస్మికంగా నిర్ణయించడం అన్ని వర్గాలలో గందరగోళం సృష్టించింది.
GhostNamasteAndhra

 

‘తానా‘సంక్రాంతి-బెట్టింగ్ బంగార్రాజులకు పండగే-ఎన్నికల కయ్యానికి కాలు దువ్విన ‘పుంజులు’
‘తానా’ ఎన్నికలవిషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,‘తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.
GhostNamasteAndhra

 

అమెరికా ఎన్నికల ఫలితాల లెక్కింపు-‘తానా’ బాలెట్ల ప్రహసనాన్ని గుర్తుకు తెస్తున్న వైనం
అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.
GhostNamasteAndhra

 

‘తానా’లో నవ శకం-నిజమా? రంగుల కలా??
‘తానా’లో ఎన్నికల విషయమై ప్రస్తుతం జోరుగా సాగుతున్న పరిణామాలు మరింత వేగంగా మారి వచ్చే జనవరి తరువాత నవ శకాన్నిఆవిష్కరించే దిశగా పరిణమిస్తున్నట్లు గోచరిస్తున్నాయి.
GhostNamasteAndhra

 

తానా జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం’ ఇంతకీ తూనీగ వాలేదెక్కడో?
‘జుగల్బందీ’ అంటే ఒకే పాటను నిష్ణాతులైన ఇద్దరు కళాకారులు తమదైన విలక్షణ పద్దతులతో గానం చేయటం, లేదా ఇద్దరు వాద్యకారులు తమ పరికరాలతో ఒకే పల్లవిని విభిన్నంగా స్వరాలు వినిపించడం.
GhostNamasteAndhra

 

రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-పిండి పిండేనా?
*‘తానా ’ఎన్నికల పై వివిధ సమావేశాల్లో చెవులుకొరుక్కుంటున్న మిత్రులు, వివరాలపై గుస గుసలు
SanjayNamasteAndhra

 

టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు?
‘తానా’ లో వచ్చే టర్మ్ కొరకు జరుగబోయే ఎలెక్షన్ల విషయమై వివిధ పదవుల్లో ఉన్నవారిలోను, ‘తానా’ రోజువారీ వ్యవహారాల్లో సమాచారం ఉండే వారిలోనే కాక సాధారణ సభ్యుల్లోనూ జరుగుతున్న చర్చలు అనేక మెలికలు తిరుగుతూ చలికాలం లో కూడా మంచి వేడిని రగిలిస్తోంది.
SanjayNamasteAndhra

 

అమెరికా తెలుగు సంఘాలు- ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు అర్ధమౌతోందా? ఇక ఆపండిరా బాబూ!
ఏవిధంగానూ విధులకు,ఆశయాలకు, విధానాలకు పొంతన లేని మరియు ఉండకూడని విభిన్నమైన అమెరికా తెలుగు సంఘాలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర రాజకీయపార్టీలు గత కొన్నిసంవత్సరాలుగా పెనవేసుకుపోయిన వైనం రెండు దేశాల్లోని ప్రజలకు సుస్పష్టం.
SanjayNamasteAndhra

 

‘తానా‘లో నవ చైతన్యం-జరిగే పనేనా??ఏమో!-‘గుర్రం’ఎగరా వచ్చు
‘తానా’ నాయకత్వం గురించి ‘నమస్తే ఆంధ్ర’ కధనాల తరువాత ఆసక్తిగా జరుగుతున్న చర్చలు, తగ్గుముఖం పట్టకపోగా ఈ ‘థాంక్స్ గివింగ్’ వీకెండ్ సందర్భంగా జరిగే సామూహిక విందు సమావేశాల్లో మరిన్ని కోణాల్లో సాగుతున్నట్లు తెలియవస్తోంది.
SanjayNamasteAndhra

 

‘తానా’లో సద్దుమణగని సందడి – ఎం జరుగుతోంది?
‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకులమధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత గూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.
SanjayNamasteAndhra

 

‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?
‘తానా’ అధ్యక్షపదవికి త్రిముఖ పోటీ గురించి ‘నమస్తేఆంధ్ర’ లో వచ్చిన వార్త అమెరికా తెలుగు ప్రజల్లో ఆసక్తి కలిగించింది .
SanjayNamasteAndhra

 

‘తానా’‘అధ్యక్ష‘పోరులో ‘త్రిముఖ’ పోటీ-పూర్వ వైభవం కోసం రంగంలోకి పెద్దలు- కాబోయే అధ్యక్షుడెవరు?
అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు.
SanjayNamasteAndhra

 

Tags: Tana elections
Previous Post

ఎన్నికల వేళ స్మగ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు?…షాకింగ్

Next Post

ప్రభుత్వం చీప్ కుట్రలు

Related Posts

TANA elections
TANA Elections

‘తానా’ జుగల్బందీ-‘తూనీగా తూనీగా ఎందాకా నీ పయనం-

April 20, 2021
TANA Elections
TANA Elections

రూమర్ మిల్ ఆఫ్ ‘తానా’ గుస గుసా-

April 20, 2021
TANA
TANA Elections

‘తానా’లో నవ శకం-నిజమా?

April 20, 2021
‘తానా’ ఎన్నికల ప్రచారం–సిలికాన్ వ్యాలీ లో సందడి చేసిన డాక్టర్ నరేన్ కొడాలి టీం
TANA Elections

‘తానా’ ఎన్నికల ప్రచారం–సిలికాన్ వ్యాలీ లో సందడి చేసిన డాక్టర్ నరేన్ కొడాలి టీం

April 19, 2021
‘తానా’ ఎన్నికల్లో చివరి అంకం
TANA Elections

‘తానా’ ఎన్నికల్లో చివరి అంకం

April 16, 2021
నరేన్ టీం-శనివారం ఏప్రిల్ 17th  బే ఏరియా పర్యటన 
TANA Elections

నరేన్ టీం-శనివారం ఏప్రిల్ 17th  బే ఏరియా పర్యటన 

April 16, 2021
Load More
Next Post

ప్రభుత్వం చీప్ కుట్రలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కరోనాపై బ్రహ్మాస్త్రం మోల్నుపిరావిర్ ట్యాబ్లెట్…ఒక్కరోజులోనే వైరస్ ఖతం
  • హైకోర్టుకు చేరిన ‘తిరుపతి’ దొంగ ఓటర్ల డ్రామా అంశం
  • ఆ వైసీపీ ఎమ్మెల్యే మాట‌ల‌కు ఎక్కువ‌.. చేత‌ల‌కు త‌క్కువ‌ట..‌!
  • కరోనాతో పాటు ఢిల్లీకి మరో కొత్త భయం
  • నేను ఎస్టీ కాదని నిరూపించగలరా? డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సవాల్
  • తెలంగాణ మావోయిస్టు లొంగిపోతే ఏపీ ఖజానా నుంచి రివార్డులా?
  • జార్జ్ ఫ్లాయిడ్ హత్య లెక్క తేల్చిన కోర్టు.. దోషి ఎవరంటే?
  • భారత్ లో కరోనా కల్లోలం…3 లక్షల మార్క్ కు చేరువలో కేసులు
  • రాహుల్‌కు క‌రోనా.. ప్ర‌ధాని మోడీ ఏమ‌న్నారంటే!
  • అలుపెరుగని శ్రమ జీవికి 71 వసంతాలు… అయినా అతడే ఒక సైన్యం
  • తెలంగాణలో నైట్ కర్ఫ్యూ…కేసీఆర్ కు కరోనా
  • మోడీ రాజీనామా చేయాలి…కోడై కూస్తోన్న నెటిజన్లు
  • పథకాలు ఎరవేసి.. జనం జేబులు లూటీ
  • హఠాత్తుగా అమరావతిపై జగన్నాటకం…ఎందుకు?
  • జ‌గ‌న్ మార్కు *రివ‌ర్స్‌*… 780 కోట్లు త‌గ్గించి 1,600 కోట్లు అద‌నంగా చెల్లింపు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds