‘తానా’ ఎన్నికల్లో మొట్ట మొదటిసారిగా ఇంచుమించు అన్నిపదవులకు పోటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనేక విషయాలపై ఏమి జరగవచ్చో అని ఉత్సుకత చెలరేగుతోంది. మొదటి వారాల్లో అత్యున్నత స్థాయి నాయకుల మధ్య వివాదపూరిత ఆరోపణలు, వాదోపవాదాలతో అమెరికా తెలుగు ప్రజలు మరియు ‘తానా’ సభ్యులు విస్తుపోవడం గుర్తుండే ఉంటుంది. ఈ విషయాలపై నిర్మొహమాటంగా కుండ బద్దలుకొట్టినట్టు పేర్లతో సహా ‘నమస్తే ఆంధ్ర’ ప్రజానీకానికి వ్యంగ్య రీతిలో తెలియచేసిన విషయమై ఎన్నో ప్రశంసలు వచ్చాయి. నిజానికి ఆ వ్యాసం కారణంగానే అన్నట్లుగా పెద్దస్థాయి నాయకులైన వారు తమ ఆరోపణల పదును అకస్మాత్తుగా తగ్గించారు.
కానీ ఎలక్షన్ ఫలితాల్లో వెనక పడుతామేమో అని భయంతో ఒకరిని మించి మరొకరు ఊర్ల మీద ఊర్లు తిరుగుతూ, కోవిద్ పాండెమిక్ లో కూడా సభ్యుల్ని ఆబ్లిగేట్ చేస్తూ మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటున్నారు. అక్కడకు వచ్చిన సభ్యుల్ని ఉత్సాహపరచటానికో, లేదా తమ నాయకుల్ని సంతృప్తి పరచటానికో కానీ ఇతర పదవుల కంటెస్టెంట్స్ మరియు కొద్దిమంది మద్దతుదారులు అగ్గ్రెస్సివె స్పీచీలతో కారం ఉప్పూ కలిపిన కామెంట్లతో చిరు మంటలు రెండువర్గాల మధ్యన రేపుతున్నారు. అవే చివరికి చిలికి చిలికి గాలి వాన రేపుతూ సభ్యుల మధ్య చర్చల కు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ‘నిరంజన్ వర్గం’ ‘నరేన్ వర్గం’ మీద డీసీ కాన్ఫరెన్స్ లెక్కలు ముఖ్య కారణంగాను ఇంకా వారి గాడ్ ఫాథర్స్ చెప్పినట్లే నడవాలా అని ఆరోపణలు సంధిస్తుండగా, ‘నరేన్ వర్గం’ ‘నిరంజన్ వర్గం’ డీసీ కాన్ఫరెన్స్ లెక్కలను ఎవరితోనైనా ఆడిట్ చేయించుకోమని సవాల్ విసురుతూ, నిరంజన్ క్లెయిమ్ చేసుకుంటున్న 100 వేలు డొనేషన్ వివరాలు లెక్క ఇంకా అడుగుతున్నా ఇవ్వక పోవడాన్ని, ఎంతోకాలం నుంచి మరియు ఇపుడు కూడా అధ్యక్షపదవులు వారి ప్రాపకంతోనే పొంది వాటిలో కొనసాగుతూ మార్పు అనడాన్ని ఎద్దేవా చేస్తున్నారు.
ఇక సరైన అడ్రస్లు లేకుండాను, వేరే దేశాలనుంచీ ఒక వర్గంపై ఒకరు ట్రోలింగులు, ఆరోపణల వీడియోలు అమెరికా ప్రజలకు ఒకరకంగా వినోదం ఇంకో రకంగా విసుగూ విరక్తి కలిగిస్తున్నాయి. ఇదే సమయములో ఇండిపెండెంట్ ప్రెసిడెంట్ అభ్యర్థి ‘శ్రీనివాస గోగినేని’ తనదైన విలక్షణ శైలితో తన అనుభవాన్ని, ఆశయాలను వివరించడంతో పాటు రెండువర్గాల ఆధిపత్య ధోరణలను, బాలట్ కలెక్షన్ వంటి దుర్వ్యవస్ధగురించి సోషల్ మీడియా, ఇమెయిల్, ఫోన్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ ఛానల్ వంటి వాటి ద్వారా అతి విస్తృతంగాను , ధైర్యంగా గాను వ్యక్తపరుస్తూ ‘తానా’ సభ్యుల్ని ఎడ్యుకేట్ చేయడంలోగాని, ఇన్స్పైర్ చేయడంలోగాని చాలా ముందు ఉన్నారు. ఆయన గురుంచి గాని, విధానాల గురించి గాని, పోటీ గురుంచి గాని తెలియని ‘తానా’ ఓటరు లేడని ఖచ్చితంగా చెప్పవచ్చును ప్రస్థుత గందరగోళ పరిస్థితుల్లో ‘తానా’ ను గాడి లో పెట్టగల నాయకుడిగా చాలామంది ‘గోగినేని’ కే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
‘తానా’ బాలెట్స్ ఏప్రిల్ 15 తారీఖున పోస్ట్ చేస్తున్న కారణంగానూ, ప్రచార సమయం ముగిసే సమయం దగ్గరికొచ్చిన కారణంగానూ ఇక ఆఖరి మరియు ముఖ్య అంకమైన బాలట్ ప్రక్రియపై అందరూ మల్ల గుల్లాలు పడుతున్నారు. ముఖ్యముగా అందరూ అసహ్యపడె విషయమైనప్పటికీ ఇంటి ఇంటికీ వెళ్లి జరుపుకునే బాలట్ కలెక్షన్లే ఆధారంగా ఎన్నికలు జరుపుకునే ‘తానా’ వర్గాలు ఆ విషయమై ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఒకే బలమైన వర్గం ఉన్నప్పుడు మనకెందుకులే అని ఇచ్చివేసె ధోరణినుంచి ఏ వర్గానికిచ్చినా రెండో వర్గముతో వైరం అనే భయం గలగడం చాలా మార్పు తెచ్చేటట్లుంది. అంతేకాక అటూ ఇటూ 20 మంది దాకా పోటీలో ఉన్న కారణంగా ఒకళ్ళిద్దరు అటూ ఇటూ కూడా తెలిసినవాళ్లకు ఓటు చేయాల్సిన కారణంగా, బాలట్ ఇచ్చేస్తే తమ వాళ్లకు ఓటు వేయలేక పోవడం వలన కూడా తమ ఓటు తామే వేసుకుందాం అని చాలామంది అనుకుంటున్నారు. అంతేకాక ‘శ్రీనివాస గోగినేని’ బాలట్ కలెక్షన్లకు వ్యతిరేకంగాను, స్వచందంగా తమకు నచ్చిన వారికి తామే ఓటు చేయవలనదిగా చేసిన ప్రచారం ఇంచు మించి అందరికీ చేరి ముఖాముఖీ చర్చలలో రావడం కూడా ఈ సారి బాలట్ కలెక్షన్లు గణనీయమగా తగ్గిపోవడానికి, చేసిన కొన్నీ కూడా వారి వారి స్వంత ఓట్లే అవటం, అదీ రెండు వర్గాలమధ్య విభజనగావడం మూలం గా పెద్దగా ప్రభావం లేక పోవచ్చని అనుకుంటున్నారు.
వీటి అన్నిటికంటే రెండువర్గాల మధ్యన ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న కారణంగాను, ఒకప్పుడు ఒకే ‘తాను ముక్కలు’గా కాపురం చేసిఉన్నందున ఏ ప్రదేశంలో ఎవరు బాలట్ కలెక్షన్లు చేస్తారో ఇరువర్గాలకు తెలిసిఉన్న కారణంగా ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. అది ఒకరిపై ఒకరికి ప్రత్యక్ష ఘర్షణ, ప్రైవేట్ డిటెక్టివ్ రిపోర్ట్ లేదా బాలట్ బాక్సులని ముట్టుకుంటే సెక్యూరిటీ కెమెరాల ద్వారాను లీగల్/పోలీస్ చర్యలకు కూడా ప్లానింగ్ జరుగుతున్నట్లు వినికిడి. ఏదైనా పోలీస్ కేసు లో ఇరుక్కుంటే ఉద్యోగాలకు, ఇమ్మిగ్రేషన్ స్టేటస్ లకు కూడా ఇబ్బందేనని కూడా భయపడుతున్నారు. ఎవరైనా ఇంటివద్ద ఘర్షణ జరిగినా, పోస్ట్ బాక్స్ హ్యాండ్లింగ్ తో సెక్యూరిటీ కెమెరాలో దొరికినా విషయం రచ్చ రచ్చ కావడం ఖాయం మూలంగా ఇంతకు ముందులా తమ తమ బాసులను సంతోషపెట్టడానికి ముందుకు ఉరికే సీనియర్ ‘బాలట్ కలెక్టర్లు’ తప్పుకునే మార్గాలను వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అమెరికా వ్యాప్తంగా ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోను బాలట్ కవర్ కలెక్షన్ల్ సందర్భంగా ఘర్షణలు అనివార్యమే.