• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

TANA-చార్లొట్ లో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రారంభ టోర్నమెంట్ లో వెల్లివిరిసిన క్రీడా స్ఫూర్తి

NA bureau by NA bureau
May 2, 2022
in NRI
0
TANA-చార్లొట్ లో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ ప్రారంభ టోర్నమెంట్ లో వెల్లివిరిసిన క్రీడా స్ఫూర్తి
0
SHARES
65
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. షార్లెట్ లోని రాబర్ట్ స్మిత్ పార్క్ క్రికెట్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ కిక్ ఆఫ్ తో తానా జాతీయ స్థాయి క్రికెట్ ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ తానా అపలాచియన్ రీజియన్ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి. సుమారు నెలన్నరపాటు ప్లానింగ్, స్పాన్సర్షిప్స్ సేకరణ, లాజిస్టిక్స్ మొదలగు విషయాలలో పకడ్బందీగా ఉండి ఏప్రిల్ 23, 24, 30 తారీఖుల్లో అనుకున్నది అనుకున్నట్టుగా టోర్నమెంట్ ని విజయవంతంగా పూర్తిచేశారు.

12 జట్లు, 163 మంది ఆటగాళ్లు, 3654 రన్స్, 1 సెంచరీ, 158 వికెట్స్, 2233 బాల్స్, 31 నోబాల్స్, 197 వైడ్లు, 364 ఫోర్లు, 208 సిక్సులు, 14 అర్ధ సెంచరీలు, 112 క్యాచ్లు, 8 రనౌట్లు, 19 డకౌట్లు తో కూడిన ఈ అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ తానా జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి గ్రాండ్ కిక్ ఆఫ్ తోపాటు క్రికెట్ ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం జాతీయ స్థాయి తానా క్రికెట్ ఛాంపియన్షిప్ కి ఇది కర్టెన్ రైజర్ ఈవెంట్ లాంటిది. ఎందుకంటే తదుపరి నిర్వహించాల్సిన మిగతా ప్రాంతీయ టోర్నమెంట్స్ కి ఉదాహరణలా ఉపయోగపడుతుంది కాబట్టి. అందుకనే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు తానా లీడర్షిప్ లో ఉన్న అతిరధమహారధులు అందరూ షార్లెట్ వైపు స్టీరింగ్ తిప్పారు.

ఇటు అట్లాంటా నుంచి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, అటు మిసిసిప్పి నుంచి ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మరియు క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ, ఒహాయో నుంచి రవి సామినేని, శ్రీని యలవర్తి, శివ చావా, అలాగే స్థానిక అపలాచియన్ రీజియన్ నాయకత్వం శ్రీనివాస్ చందు గొర్రెపాటి, పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్ మల్లినేని, రాజేష్ యార్లగడ్డ, వేణు చావా, వినోద్ కాట్రగుంట తదితరులు తరలివెళ్లారు. ఈ రీజినల్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు తలపడ్డాయి. లీగ్ గేమ్స్ అన్నీ ఏప్రిల్ 23, 24 న ముగించారు. ఏప్రిల్ 30 న మొదటి సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఫీనిక్స్ సీసీ మరియు జాతిరత్నాలు జట్లు పోటీపడగా ఫీనిక్స్ సీసీ జట్టు 38 పరుగుల తేడాతో గెలుపొందింది. అలాగే రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ లో బిందాజ్ బాయ్స్ మరియు డాషింగ్ డైనమిట్స్ జట్లు పోటీపడగా బిందాజ్ బాయ్స్ జట్టు 75 పరుగుల తేడాతో గెలుపొందింది.

సెమీఫైనల్స్ లో గెలుపొందిన ఫీనిక్స్ సీసీ మరియు బిందాజ్ బాయ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగి, చివరికి బిందాజ్ బాయ్స్ జట్టుని విజయం వరించింది. 8 వికెట్లతో బిందాజ్ బాయ్స్ జట్టు అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. రాబోవు రోజుల్లో మిగతా రీజియన్స్ లో విజేతలైన జట్లతో ఈ అపలాచియన్ రీజియన్ బిందాజ్ బాయ్స్ జట్టు జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో పోటీపడుతోంది. ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్ సెరిమోనీ కార్యక్రమంలో భాగంగా అన్నిటి కంటే ముందు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ జరిగిన మూడు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే అంతకుముందు ప్లానింగ్ మరియు లాజిస్టిక్స్ లో బ్లడ్ పెట్టి మరీ పని చేసిన ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, ఈవెంట్ కోఆర్డినేటర్స్ వెంకీ అడుసుమిల్లి, అశ్విన్ యడ్లపల్లి, శ్రీధర్ పెళ్లూరు, లక్ష్మీపతి జూలపల్లి, అలాగే వాలంటీర్స్ సుధీర్ బొల్లం, శ్రీనాధ్ గింజుపల్లి, సాయి కిలారు, ప్రణయ్ రెడ్డి మైనంపాటి, రవి బొజ్జ, యశ్వంత్ బాగం, సతీష్ నాగభైరవ, బాల నల్లపనేని తదితరులందరినీ పేరు పేరునా ప్రత్యేకంగా అభినందించడం అందరినీ ఆకట్టుకుంది.

అనంతరం తానా నాయకత్వం అంతా కలిసి ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీనిక్స్ సీసీ రన్నర్స్ జట్టుకి $750 క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ, విజేతలైన బిందాజ్ బాయ్స్ జట్టుకి $1500 క్యాష్ ప్రైజ్ మరియు ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా బిందాజ్ బాయ్స్ జట్టు $500 తిరిగి తానా ఫౌండేషన్ కి డొనేట్ చేయడం అభినందనీయం. అన్ని మ్యాచ్ లకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే టోర్నమెంట్ మొత్తంమీద బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మ్యాన్, మోస్ట్ వాల్యూడ్ ప్లేయర్ వంటి ట్రోఫీస్ కూడా అందించారు. ఈ జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ కి ఆద్యులు తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ప్రత్యేకంగా షార్లెట్ వచ్చి ఈ టోర్నమెంట్లో అందరితో కలివిడిగా, చనువుగా ఉంటూ చివరి వరకు ప్రోత్సాహం అందించడం మెచ్చుకోవలసిందే. వారాంతాలవడం మరియు వాతావరణం కూడా అనుకూలించడంతో ప్రేక్షకులు కుటుంబసమేతంగా హాజరయ్యారు.

ఉదయం నుంచి రాత్రి వరకు అందరికీ ప్రత్యేకంగా హోమ్ మేడ్ భోజన సదుపాయాలు సమకూర్చడంతో టోర్నమెంట్ ఆసాంతం క్రీడా స్ఫూర్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అపలాచియన్ రీజియన్ టోర్నమెంట్ ని ఘనంగా ముగించడమే కాకుండా మున్ముందు జరగబోయే రీజినల్ టౌర్నమెంట్స్ కి బార్ హై లో సెట్ చేసారు

Tags: tana cricket
Previous Post

సిరికోన పురస్కారం దక్కించుకున్న ‘ఏటివాలు జ్ఞాపకం’ 

Next Post

కేఏ పాల్ కు టీఆర్ఎస్ పబ్లిసిటీ

Related Posts

WETA-ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`
NRI

WETA-ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగిన `మ‌ద‌ర్స్ డే`

May 16, 2022
NRI TDP USA-బోస్ట‌న్‌ లో మే 20-21 తేదీల్లో ‘మ‌హానాడు’ వేడుక‌లు!
NRI

NRI TDP USA-బోస్ట‌న్‌ లో మే 20-21 తేదీల్లో ‘మ‌హానాడు’ వేడుక‌లు!

May 13, 2022
‘సర్కారువారి పాట’ అమెరికా లో మొదటి ఆట టాక్
Movies

‘సర్కారువారి పాట’ అమెరికా లో మొదటి ఆట టాక్

May 12, 2022
సెయింట్ లూయిస్ లో ‘మహా కుంభాభిషేకం’ వేడుకలు!
NRI

సెయింట్ లూయిస్ లో ‘మహా కుంభాభిషేకం’ వేడుకలు!

May 9, 2022
రిచ్‌మండ్ లో”ఉగాది మరియు శ్రీరామనవమి 2022″ వేడుకలు!
NRI

రిచ్‌మండ్ లో”ఉగాది మరియు శ్రీరామనవమి 2022″ వేడుకలు!

May 9, 2022
`అంతిమ` సంస్కారానికి ఆత్మీయ వీడ్కోలు!
NRI

`అంతిమ` సంస్కారానికి ఆత్మీయ వీడ్కోలు!

May 7, 2022
Load More
Next Post
K A paul కేఏ పాల్

కేఏ పాల్ కు టీఆర్ఎస్ పబ్లిసిటీ

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds