తమిళ సినీ హీరో అజిత్‌కు ఫార్ములా ఈ రేస్ అచ్చొచ్చినట్టు కనిపించడం లేదు. ఈ రేసులో తాజాగా ఆయ న మరోసారి ప్రమాదానికి గురయ్యారు. ఆయన నడుపుతున్న వాహనం గాల్లో పల్టీలు కొట్టింది. అయితే.. ఆయనకు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్యన కార్ రేసింగుల్లోనూ పాల్గొంటున్నాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగుల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు.
అయితే అజిత్ వరుసగా ప్రమాదాల బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. అజిత్ కుమార్ స్పెయిన్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయట పడినట్లు వీడియోలో కనిపించింది. హీరోకు ఎలాంటి గాయలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. ఇటీవల కూడా ఆయనకు ఇదే రేస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. క్షణ కాలంలో ఆయన మృత్యు వు నుంచి తప్పించుకున్నారు. అయితే.. తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా పూజలు చేశారు. ఆ ప్రమాదం నుంచి ఇటీవలే కోలుకున్న అజిత్ తాజాగా మరోసారి రేసులో పాల్గొన్నారు.
అయితే.. ఈసారి తమ అభిమాన హీరోకు విజయం దక్కాలని కోరుకుంటూ అభిమానులు పూజలు చేయించారు. కానీ, విజయం మాట అలా ఉంచితే.. ఈ దఫా కూడా ప్రమాదానికి గురి కావడం.. దాని నుంచి ఆయన క్షేమంగా బయటపడడం మాత్రమే అభిమానులకు ఊరటనిచ్చింది. దీనిని బట్టి అజిత్ ఫార్ములా రేస్‌లు కలిసి రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది.