#జస్ట్ ఆస్కింగ్.. అంటూ ఇతరులపై విమర్శలు గుప్పించే బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కు భారీ ఎదు రు దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఆయన #జస్ట్ ఆస్కింగ్ అనడమే కానీ.. ఆయనను పెద్దగా ప్రశ్నించిన వారు లేరు. కానీ, అదే.. #జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ప్రముఖ నిర్మాత(మార్క్ ఆంటోనీ, ఎనిమి సినిమా లు) వినోద్‌కుమార్ గట్టిగానే తగులుకున్నారు. తిరుమల లడ్డూ వివాదం తెరమీదకి వచ్చిన తర్వాత.. ప్రకాష్‌రాజ్.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా కూడా ఆయన తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి డిప్యూటీ సీఎం ఉదయనిధి పక్క న కూర్చొన్నారు. ఈ సందర్భంగా కూడా పవన్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేప థ్యంలో `#జస్ట్ ఆస్కింగ్` అంటూ.. వినోద్ కుమార్ కూడా పదునైన వ్యాఖ్యలతో ప్రశ్నలు సంధించారు.
“నీ పక్కన కూర్చొన్న ముగ్గురు వ్యక్తులు(తమిళనాడు కార్యక్రమంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉద యనిధి, మరో నేత తిరుచ్చి శివ) ఎన్నికల్లో విజయం సాధించారు. నువ్వు అయితే డిపాజిట్లు కూడా కోల్పో యావు. అదే మీ మధ్య ఉన్న తేడా“ అని ప్రకాష్‌రాజ్‌కు చురకలు అంటించారు. ఇక్కడితో కూడా వినోద్ కుమార్ ఆగలేదు.
తన సినిమా షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ చేసిన పనిని ఆయన ప్రశ్నించారు. నాలుగు రోజుల పాటు కాల్ షీట్లు ఇచ్చి.. అడ్వాన్సులు తీసుకుని.. షూటింగ్ సమయానికి వేరే నిర్మాత ఫోన్ చేస్తే వెళ్లియా రని వ్యాఖ్యానించారు. దీంతో 1000 మంది ఆర్టిస్టులతో పాటు సినిమా టీం అంతా నష్టపోయారని.. నీవల్ల రూ.కోటి నష్టం వాటిల్లిందని.. దీనిని ఏం చెబుతారు? # జస్ట్ ఆస్కింగ్!! అని వినోద్ కుమార్ వ్యాఖ్యానించా రు. అయితే.. ఈ పోస్టులపై ప్రకాష్ రాజ్ స్పందించక పోవడం గమనార్హం.