అయ్యో.. మిల్కీ బ్యూటీకి కరోనా

Movies Oct 04, 2020

కరోనా బారిన పడ్డ ఎంతోమంది ప్రముఖులను చూశాం. చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి ఏమంత బాగా కూడా లేదు. ఆసుపత్రిలో చేరి అత్యవసర చికిత్స కూడా తీసుకుంటున్నాడు.

ఇండియా విషయానికి వస్తే ఎంతోమంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కరోనా బాధితులయ్యారు. వివిధ సినీ రంగాల్లో ఎంతోమందికి వైరస్ సోకింది. ఈ జాబితాలో తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరింది. ఆమెకు కొంచెం కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడైంది.

రెండు నెలల కిందట తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకింది. వాళ్లు ఇంట్లోనే ఉంటూ చికిత్స చేయించుకుని కోలుకున్నారు. అప్పుడు తమన్నా కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ తాజా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఆమె వెంటనే ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

లాక్ డౌన్ టైంలో ఇంటిపట్టునే ఉన్న తమన్నా.. గత నెలలోనే బయటికి వచ్చింది. షూటింగ్‌లకు కూడా రెడీ అయింది. ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’ కోసం ఆమె ఒక టాక్ షో లాంటిది చేయాల్సి ఉంది. అలాగే ‘సత్యదేవ్ సరసన ‘గుర్తుందా శీతాకాలం’, నితిన్‌తో కలిసి ‘అందాదున్’ రీమేక్‌ల్లో తమన్నా నటించాల్సి ఉంది.

ఇంతలోనే ఆమెకు కరోనా సోకినట్లు వార్త బయటికి వచ్చింది. వయసు తక్కువ, పైగా మంచి ఫిట్నెస్ ఉన్న అమ్మాయి కాబ్టటి తమన్నాకు కరోనాతో పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లకు హాజరు కావాలని కోరుకుందాం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.