మూడు పదుల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కానీ ముదురు ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం నడుపుతోంది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ పరిచయం ప్రేమగా మారింది. సెలబ్రిటీలు తమ ప్రేమ వ్యవహారాలను రహస్యంగా ఉంచేందుకు ఇష్టపడతారు. కానీ తమన్నా అందుకు పూర్తిగా భిన్నం. విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తమన్నా స్వయంగా రివీల్ చేసింది.
ఇక కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో చాలా రోజుల నుంచి పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న తమన్నా.. ఎట్టకేలకు ఓ ఇంటిది కాబోతుంది. త్వరలోనే ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా ఏడడుగులు వేయబోతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. విజయ్ పుట్టి పెరిగింది హైదరాబాద్ కావడంతో.. అక్కడే వివాహం చేసుకోవాలని భావిస్తున్నాడట.
డిసెంబర్ ఆఖరి వారంలో లేదా నూతన సంవత్సరం 2025 ప్రారంభంలో విజయ్ వర్మ, తమన్నా పెళ్లి వేడుక ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు హైదరాబాదులోని ఓ ప్రముఖ రెసార్ట్ వేదిక కాబోతోందట. ఇక వివాహం అనంతరం కొత్తగా కాపురం పెట్టేందుకు ముంబై బాంద్రా లో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కొనేందుకు ప్రస్తుతం తమన్నా, విజయ్ సెర్చింగ్ మొదలుపెట్టారని టాక్. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం తెలుగు చిత్రం ఓదెల 2లో యాక్ట్ చేస్తోంది. మరోవైపు విజయ్ వర్మ హిందీ మరియు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.